అప్పటివరకు ఆమె ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.
కానీ దబాంగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆమె ఎవరో కాదు…త్రఘ్న సిన్హా ముద్దుల తనయ సోనాక్షి సిన్హా.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్గా తొలిసారి చేసింది.
తొలి సినిమాయే భారీ సక్సెస్. ఆ తర్వాత తిరుగులేదు ఈమెకు.
అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి పెద్ద సీక్రెట్ చెప్పింది.
ఒక అబ్బాయితో తాను దాదాపు ఐదేళ్లు రిలేషన్ షిప్లో ఉన్నట్లు చెప్పింది. ఎర్లీ 20స్ లోనే ఇది జరిగిందని వెల్లడించింది. అయితే అది అంత పెద్ద రిలేషన్ షిప్ కాదని తనే చెబుతోంది. మనకు ఎదురయ్యే ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని చెబుతోంది. పెరిగే కొద్దీ కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయని.. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలని తెలిపింది సోనాక్షి సిన్హా.
సోనాక్షి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికపుడు ఫొటోలు, ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది. నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.