బాలీవుడ్ నటి రిచా చద్దా ఒక్క కామెంట్.. ఒకే ఒక్క కామెంట్.. దేశంలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగా కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. ఆసేతు హిమాచలం.. అందరు ప్రముఖులు ఈ ట్వీట్‌పై స్పందించారు. రాజకీయ నేతలు.. సాధారణ నెటిజన్లు అయితే.. దుమ్మెత్తిపోస్తున్నారు.
విమర్శలతో ముంచేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కీలక పార్టీ బీజేపీని డిఫెన్స్‌లో పడేసింది. మరి ఈ కామెంట్ చేసిందెవరు? అసలు ఆ కామెంట్లో ఏముంది? అనేది మనమూ చూద్దాం. బాలీవుడ్ నటి రిచా చద్దా ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్‌గా మారి కామెంట్లు చేస్తోంది.
భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీనినే పీవోకే అంటున్నారు. అయితే, పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంపై ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిని రిచా రీట్వీట్ చేస్తూ ఆమె పెట్టిన సందేశం తీవ్ర దుమారానికి, వివాదానికి దారితీసింది.
Richa Chadda ???????? pic.twitter.com/phzhGZJogB
— ActressBuff (@actressbuff3) July 31, 2022
కొన్ని రోజుల కిందట.. ఏం జరిగిందటే..
పాక్ ఆక్రమిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం సిద్ధంగా ఉంటుందని నార్తర్న్ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. దీనిని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను కోట్ చేసిన నటి రిచా చద్దా.. ‘గల్వాన్ సేస్ హాయ్`(గల్వాన్ ప్రాంతం హాయ్ చెబుతోంది!) అంటూ రీట్వీట్ చేశారు. ఇది దుమారానికి దారితీసింది. సైన్యాన్ని కించపరిచేలా నటి ట్వీట్ ఉందని రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.
రిచా చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఆమె ట్వీట్‌పై బీజేపీ.. శివసేన పార్టీలు మండిపడ్డాయి. ఆర్మీని అవహేళన చేసేలా వ్యవహరించడం దురదృష్టకరమని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. ట్వీట్లో గల్వాన్ ప్రస్తావన తెచ్చి జోక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని నళిన్ కోహ్లీ కోరారు.
మరో నాయకుడు.. మంజిత్ సింగ్ సిర్సా కూడా నటి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సైన్యాన్ని అవమానిం చటం.. సమర్థనీయం కాదని మండిపడ్డారు. అటు శివసేన సైతం.. నటి ట్వీట్‌పై ఘాటుగా స్పందించింది. ఈ తరహా దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై.. నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు రిచా చద్దా ట్వీట్‌పై బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్.. ముంబయిలోని జుహూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వారిని నటి అవమానించారని మండిపడ్డారు. నటిపై.. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో నటి రిచా చద్దా స్పందించారు. తన వ్యాఖ్యను తప్పుగా అర్ధం చేసుకున్నారని, క్షమాపణలు కోరారు.
Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. ???? pic.twitter.com/inCm392hIH
— Akshay Kumar (@akshaykumar) November 24, 2022