జాతీయ పార్టీల రాజకీయాలకు తెలుగు నేలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అలవాటు పడడం లేదు. కొన్ని సార్లు సఖ్యంగా ఉండి, కొన్ని సార్లు దూరంగా ఉంటే రాష్ట్రానికి దక్కేవి దక్కవు. పోనీ మనోళ్లేమయినా లాబీయింగ్ లో స్పెషలిస్టులా అంటే సొంత పనులు చేయించుకోవడం తప్ప మిగిలిన వ్యవహారాల్లో వీళ్లు సాధించింది, తలదూర్చి సాధించింది ఏమీ లేదు.
తలవంపులు తప్ప రాష్ట్రానికి దక్కింది కూడా ఏమీ లేదు. అందుకే రాష్ట్రానికి దక్కేందుకు చాలా ఉన్నాయి కానీ దక్కడం లేదు. ఆర్థికంగా రావల్సినవి చాలా ఉన్నాయి అవి రావడం లేదు. ముఖ్యంగా తెలుగు నేతల అసమర్థతకే ఇవి చిహ్నాలు అని తరుచూ పొలిటికల్ ఎనలిస్టులు చెప్పే మాట. ఆ రోజు రాజధాని నిర్మాణానికి 1200 కోట్ల రూపాయల వరకూ సాయం చేసిన బీజేపీ, తరువాత మాత్రం ఆ సాయాన్ని కొనసాగించలేకపోయింది. చంద్రబాబు కూడా కొన్ని తప్పిదాలు నిర్ణయాత్మక రీతిలో చేసి ఉన్నారు. కానీ వాటి ఆధారంగా బీజేపీ టీడీపీ బంధాన్ని చెడగగొట్టి వైసీపీ లాభపడింది. కి కలిసి వచ్చింది.
జగన్ వల్ల రాష్ట్రం నాశనం అంటున్నారు పవన్. మరి వారి పొత్తులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (ఏపీ విభాగం) సోము వీర్రాజు జగన్ పై తిరుగుబాటు స్వరం వినిపించగలరా? క్విట్ జగన్ – సేవ్ ఏపీ అనే ధైర్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు.
ఎందుకంటే ఎప్పటి నుంచో బీజేపీ కి మిత్ర పక్షంగా ఉంటూ వస్తున్న వైసీపీ, వైసీపీకి దగ్గర బంధంగా ఉంటూ వ్యవహరిస్తున్న బీజేపీ పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తున్నాయి అన్నది వారి సుస్పష్టమయిన అభిప్రాయం. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే కొన్ని మార్పులు మరియు కొన్ని చేర్పులు జరిగాయి. గతంలో టీడీపీతో సఖ్యంగా ఉన్న బీజేపీ తరువాత కాలంలో ఆ బంధానికి కటీఫ్ చెప్పేసింది.
అందుకు కారణాలు ఏవయినా కానీ ఆ రోజు చేసింది తప్పే బాబు తెలుసుకున్నారు. అప్పటిదాకా ఉన్న స్నేహం తెగదెంపులు అయిన కారణంగానే లక్కీగా సీన్ లోకి వైసీపీ బాస్ జగన్ ఎంటర్ అయ్యారన్నది టీడీపీ నాయకుల వాదన. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తుంటారు. కొన్ని ప్రయివేటు సంభాషణల్లో కూడా ఇదే విషయం ఇప్పటికీ చర్చకు వస్తుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ చెప్పిన విధంగా బీజేపీ క్విట్ జగన్ అని చెప్పలేదు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే లోపాయికారి ఒప్పందాల్లో భాగంగా ఆ రెండు పార్టీలూ కలిసి మరో పార్టీ (టీడీపీ)ని బుల్డోజ్ చేయాలని యోచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కనుక సోము వీర్రాజు ఆ మాట చెప్పరు. చెప్పలేరు కూడా !