ఏపీ సీఎం జగన్పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. జగన్కు రోజులు దగ్గర పడ్డాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవిని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ రవిని కిడ్నాప్ చేసి పోలీసులు చంపేయాలకున్నారని, పేరుకు యువగళం పాదయాత్ర కేసుగా చూపించారని వ్యాఖ్యానించారు. కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారని చెప్పారు.
ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని రవిని బెదిరించారని సీఎం రమేష్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తామని సీఎం రమేష్ చెప్పారు అంతేకాదు.. రవిని హత్య చేస్తామని కూడా కొందరు బెదిరించారని ఆయన ఆరోపించారు. “బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది. పులివెందులలో అంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టావు?, సునీత, లూథ్రాలు ఏమైనా చేస్తామని చెప్పారా? అంటూ బీటెక్ రవిని పోలీసులు బెదిరించారు’’ అని రవి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్పై రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సీఎం జగన్కు రోజులు దగ్గర పడ్డాయి. అడ్డుగా ఉన్న వారిని అంతు చూడాలని చూస్తున్నారు. కానీ, ఆయన ఆటలు సాగినవ్వం. కేంద్రం దృష్టికి ఇక్కడి అరాచకాలు తీసుకువెళ్లి జగన్కుబుద్ధి చెప్పేలా చేస్తాం.ఇక, అధికారం నుంచి నేరుగా జైలుకు వెళ్లేందుకు జగన్ రెడీగా ఉండాలి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు“ అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.