కాలం కొన్నింటికి గట్టి సమాధానాలు చెబుతుంది. అలా చూస్తూ ఉండాలి అంతే. లేకపోతే ఈ విచిత్రం ఏంటి చెప్పండి… దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పకుండా ఈ సోదంతా ఏంటనుకుంటున్నారా? అదేనండీ గుజరాత్ లో ఉంటూ జగన్ రెడ్డి భజన చేసే పీవీఎస్ శర్మగారు లేరూ… ఆయన గురించి. ఈ శర్మగారు సాదాసీదా వ్యక్తి కాదండోయ్ బీజేపీ ఉపాధ్యక్షులు అన్నమాట. ఆ ఉత్తముడిని పాపం సొంత గవర్నమెంటే అన్యాయంగా అరెస్టు చేసేసిందండీ… మనీ లాండరింగ్ కు పాల్పడినందుకు ఆయనగా రిని నిన్న అరెస్టు చేశారు. డిసెంబరు 2వ తేదీ వరకు రిమాండుకు కూడా తరలించారు.
గుజరాత్ లో ఎవరో అరెస్టయితే ఇంత విశేషంగా చెబుతున్నాం ఏంటా అనుకుంటున్నారా…. అరెరె మీరు మంచి పాయింట్ మిస్సయ్యారన్నమాట. ఆయన గారు అవినీతి పరులను ఏరిపారేయాలని చిలకపలుకులు పలికిన వ్యక్తి. ఆ విషయం మీరు గతంలో చూడకపోతే ఇపుడు చూపిస్తాంగా…
ఇది గో ఈ కింద స్క్రీన్ షాట్ చూడండి. దాని కింద ట్వీట్ లింకు కూడా చూడండి. తర్వాత మాట్లాడుకుందాం.
చూశారా…అపుడెపుడో అక్టోబరు మొదటి వారంలో జగన్ రెడ్డి గారు నరేంద్రమోడీని కలిసిన పరవశంలో పీవీఎస్ శర్మ గారు వేసిన ట్వీట్స్ ఇవి.
వాటి అర్థం పరమార్థం ఏమిటయ్యా అంటే ఇక అవినీతి మహారాజు అయిన చంద్రబాబు తాట తీయడమే లేటు, ఒక్క చంద్రబాబేమిటి, ఆయన పార్టీ నేతలు, ఆయన కొడుకు, అమరావతిలో పెట్టుబడులు పెట్టిన రాబందులు (పెట్టబడులు పెట్టిన వారిన ఇలా అంటారని ఇపుడే తెలిసింది), బాబు అనుకూల మీడియా (వీరి దృష్టిలో అనుకూలమీడియా అంటే చంద్రబాబుకు సంబంధించిన ఏ వార్త వేసినా అంతే అనుకూలమీడియా అయిపోతుంది) ఇక రేపో మాపో అరెస్టయి పోతారట. జగన్ ఏం చెబితే దానికి మోడీ డుడు బసవన్నలా వినేసి, జగన్ గారి కేసులు అన్నీ చటుక్కున మరిచిపోయి ఆ కేసులన్నీ చంద్రబాబు మీద బనాయించి ఆయన్ను ఆయన పరివారాన్ని లోపలేస్తారట రేపోమాపో.
పాపం ఓసోస్ అంత పెద్దాయన చెప్పారంటే చంద్రబాబును ఎపుడు అరెస్టు చేస్తారా అంటూ జగన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రావల్సిన వార్త రానే వచ్చింది. కింద చూడండి.
పాపం ఎవరైనా ఇపుడు జైలుకెళ్లి శర్మగారికి ఆయన పాత ట్వీట్లు చూపిస్తే బాగుణ్ణే. ఎందుకంటే ఎలాగూ జగన్ అభిమానులు ఇక్కడ చదువుతారు. శర్మగారు బిజిబిజీగా దేశంలో అవినీతి పరులు ఎవరో కనుక్కునే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి మీలో ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకుని ఆయన పాత ట్వీట్లు ఆయనకు చూపిస్తారని ఆశిస్తున్నాం.
తెలుగులో ఒక సామెత ఉంది
చెప్పేది శ్రీరంగనీతులు, దూరేది సానికొంపలు
ఎందుకో ఈ సామెత గుర్తొచ్చింది. పై వార్తకు ఈ సామెతకు ఏం సంబంధం లేదని విన్నవించుకుంటున్నాం.