రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇంతకాలం కాంగ్రెస్ పై నమ్మకం లేక చాలామంది బీజేలోకి వెళ్లిన విషయం అర్థమవుతుంది. ఎందుకంటే రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కాంగ్రెస్ లోకి తిరుగు వలసలు మొదలు అయ్యాయి. అదే సమయంలో బీజేపీ నుంచి కీలక నేతలు బయటకు పోతున్నారు.
ఒక ఈటల రాజేందర్ చేరిక మాత్రమే బిజెపికి కాస్త ఊరటను ఇచ్చింది. ఆయన వ్యాపారి కాబట్టి వ్యాపారులకు అనుకూలమైన బీజేపీలో చేరారు. ఈటల విషయం పక్కన పెడితే మోత్కుపల్లి, పెద్దిడిరెడ్డి తదితరులు బీజేపీ నంచి నిష్క్రమిస్తున్నారు. వారు ఈటలను కారణంగా చూపున్నారు కానీ అసలు కారణం అది కాదు.
దేశ వ్యాప్తంగా ఒకవైపు మోడీ ప్రభ తగ్గుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభ పెరుగుతోంది. పైగా రేవంత్ నాయకత్వం వల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. కేసీఆర్ పదేళ్ల సుదీర్ఘ పాలన కూడా దీనికి ఒక కారణంగా మారొచ్చు.
మరో కోణంలో పెద్దిరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తే… పెద్ది రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల టికెట్ ఆశించారు. అది ఈటలకు దక్కడంతో ఆయన నిరాశకు గురయ్యారట. విచిత్రం ఏంటంటే…బీజేపీలో అతన్ని బుజ్జగించే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. దీంతో అతను బీజేపీకి రాజీనామా చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు టి-బిజెపికి మోత్కుపల్లి, పెద్దిరెడ్డిల రాజీనామాలు పెద్ద దెబ్బ అనవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇవి కీలకమైన పరిణామాలు.