రైతు సంఘాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలు చేయడం పొరపాటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన అధికారికంగా ఎక్కడా ఈ వ్యాఖ్యలు చేయలేదు. రైతు సంఘాల నేతలతో ఈ వ్యాఖ్యలు చేశారట.
ఈ విషయాన్ని నిరసనలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన రైతు నేత శివకుమార్ శర్మ కాకాజీ తెలిపారు. ఆయనతో పాటు పలువురు నేతలు రైతుల తరఫున కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ సందర్భంలో అమిత్ షా అలాంటి వ్యాఖ్యలు చేశారట. హోమ్ శాఖ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించాల్సి వుంది.
ఇదిలా ఉండగా… ఉత్తరాది బీజేపీ నేతల్లో వణుకు పుడుతోంది. ఎందుకంటే గతంలో తమిళనాడు రైతులు ధర్నాలు చేస్తే పట్టించుకోలేదు మోడీ. ఎందుకంటే అక్కడ మోడీ పార్టీకి ఓట్లు లేవు. కాబట్టి పెద్దగా పార్టీకి నష్టం జరగలేదు. ఇపుడు అలా కాదు. ఆవేదన అంతా ఉత్తరాది రైతుల నుంచే వస్తోంది. ఇపుడు నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే దీనిని సీరియస్ గా తీసుకుంది కేంద్రం. మొత్తానికి వ్యవసాయ చట్టాల్లో పెద్ద మార్పులే రానున్నాయని చెప్పొచ్చు.