రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుంజుకోవాలి.. కుదిరితే అధికారం.. లేకుంటే ప్రధాన ప్రతిపక్షం.. అనే లక్ష్యా లను నిర్దేశించుకున్న బీజేపీ పార్టీ..ఎందుకు పుంజుకోలేక పోతోంది? ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సహా ఇతర కుల సంఘాల నాయకులు, సామాజిక వర్గాల కారణంగానే తాము ఎదగలేకపోతున్నామని.. చెబుతున్న మాటల్లో ఏమేరకు వాస్తవం ఉంది? అనేది ప్రధాన చర్చనీయాంశం గా మారింది. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ పాలిటిక్స్ భిన్నం. ఈ క్రమంలో పార్టీని ఎలా నడిపించాలి? ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అనేది కీలకాంశం.
అయితే… వీటిని అందిపుచ్చుకుని.. ముందుకు సాగాల్సిన నాయకులు ఎక్కడ చతికిల పడుతున్నారు? అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కమల నాథుల ఉద్దేశం ఏంటి? అనే విషయాలను పరిశీలిద్దాం. ఏపీ విష యానికి వస్తే.. ఇక్కడ అధికార పార్టీ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ద్వంద్వ విధానం తీవ్ర విమర్శ లకు అవకాశం ఇస్తోంది. ఇది.. పార్టీ పురోభివృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది. పైగా 2019 ఎన్నికల సమ యంలో బీజేపీ-ఆర్ ఎస్ ఎస్లు బైబిల్ పార్టీగా పేరున్న వైసీపీకి సహకరించడం మరింతగా పార్టీని దిగజార్చింది.
ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలను తప్పబట్టాల్సిన బీజేపీ.. ఏపీ నేతలు.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంతో అసలు బీజేపీ వ్యూహానికే ఎసరు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిని గమని స్తే.. బీజేపీ నేతలు.. వైసీపీకి తెరచాటు మద్దతుదారులనే పేరును తెచ్చుకున్నారు. మరి ఇలాంటి పరిస్థి తిని వారే కల్పించుకుని.. టీడీపీ వల్ల, కుల రాజకీయాల కారణంగాను తాము ఎదగలేకపోతున్నామ ని.. చెప్పడం.. వెనకటికి..ఆడలేక మద్దెల ఓడు! అన్న చందంగానే మారిందని అంటున్నారు పరిశీలకులు. ఇక, తెలంగాణ విషయాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఒకరు ఒక విధానం ఎంచుకుంటే.. మరొకరు మరో మార్గంలో వెళ్తామంటారు.
దీంతో పార్టీలో నేతల మధ్య విధానాలే సరిగా లేవనే మాట వినిపిస్తుండడం గమనార్హం. ఎవరు తీసుకున్న నిర్ణయం కారణంగా బీజేపీ తెలంగాణలో కూలిపోయింది. వాస్తవానికి తెలంగాణ సాధనలో జాతీయ స్థాయిలో తాము కూడా ప్రయత్నాలు చేశామని, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర యుద్ధమే చేశారని చెప్పుకొనే బీజేపీ నాయకులు.. ఆ సెంటిమెంటును పండించుకుని అధికారంలోకి వస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. దీనికి భారీ గండిపడి.. ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక, బీజేపీ నేతల విషయాన్ని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ వందల కోట్ల ఆస్తులను పోగేసుకున్నారనేది వాస్తవం.
గతంలో బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు, జానాకృష్ణమూర్తి వంటివారు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టించారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఎవరికి వారు ఎవరి లైన్లో వారు ఉన్నారే తప్ప.. ఉమ్మడి కార్యాచరణతో పార్టీని ముందుకు నడిపిస్తున్న పరిస్తితి కనిపించడం లేదు. జాతీయ నాయకత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగానే పరిగణిస్తోంది. ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రికిషన్ రెడ్డి.. కొన్నేళ్లుగా.. ఎంఐఎం సహా కాంగ్రెస్(వైఎస్సార్ సమయంలో) పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనేది తెలిసిన విషయమే. ఇలా.. ఎవరికి వారుగా ఉన్న బీజేపీ.. తాను ఎదగలేక.. పక్కపార్టీలపై నిందలు వేయడం.. ఏమేరకు సబబనేది కమల నాథులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.