రాజకీయ నేతలంతా ఒకేలా ఉండరు. అందుకు తగ్గట్లే కొందరునేతలు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డిని చెప్పాలి. ఇప్పుడున్నరాజకీయానికి కాస్త భిన్నంగా ఆయన తీరు ఉంటుంది. జెంటిల్ మెన్ అన్నట్లుగా ఉండే ఆయన తీరు ఉంటుంది. ఇటీవల బీజేపీలోకి వెళుతున్నట్లుగా ప్రచారం సాగినా.. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అత్యధిక డివిజన్లలో అధిక్యతను ప్రదర్శించటం చాలామందికి షాకింగ్ గా మారింది. టీఆర్ఎస్ నేతలకైతే ఆశ్చర్యానికి అంతే లేని పరిస్థితి. నోటి వెంట మాట రాకుండా పోవటమే కాదు.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగులు పూర్తిగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్పష్టమైందన్నారు.
టీఆర్ఎస్ ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందన్న విషయాన్ని వారు కచ్ఛితంగా నమ్మతున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ నేత అయి ఉండి బీజేపీని పొగడటం చర్చగా మారటమే కాదు.. తాజా ట్వీట్ ఆయన త్వరలో బీజేపీలోకి చేరనున్న విషయాన్ని స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలు చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బీజేపీకి ఎక్కువ సీట్లలో పాగా వేస్తున్నట్లుగా ఫలితాలు రావటం గమనార్హం.