బీజేపీ ఎంత గొంచు చించుకున్నా, ఎంత వీర పోరాటం చేసినా వాళ్లు జగన్ బి టీం అనే ముద్ర పోగొట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు చేసే పనులు అలా ఉన్నాయి.
ఉత్తరాది రాముడికి ఏం జరిగినా ఊరుకోని బీజేపీ ఉత్తరాంధ్ర రాముడి విగ్రహం తీసి గుంతలో పడేసినా ఒకట్రెండు రెజుల ధర్నాతో మమ అనిపించి ఆ ఇష్యూని పక్కన పడేసింది.
ఇదొక్కటే కాదు… రాష్ట్రంలో వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ జగన్ ని తమలపాకుతో కొట్టినట్టుగానే ఉన్నాయి. ఉద్యోగుల సమ్మెను డైవర్ట్ చేయడానికి ప్రజల్లో జిల్లాల అలజడి సృష్టించిన జగన్ … ప్రతిపక్షాల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడంతో ఆ పని చేసే బాధ్యతను వీర్రాజుకు అప్పగించినట్లు వ్యవహారం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ ఇష్యూ ని సక్సెస్ ఫుల్ గా నెత్తినెత్తుకున్న వీర్రాజు… ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ … రాయలసీమ ప్రజలను నేరుగా హంతకులు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. హత్యలు చేసుకునే వారికి ఎయిర్ పోర్టులున్నాయి. మిగతా వాళ్లకు వద్దా అన్నట్లు అతను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో ఇపుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పారు.
ఆయన నిన్న ఏం మాట్లాడారు? ఈరోజు ఏం మాట్లాడారు? అనేది చూద్దాం.