వైసీపీ నాయకులు రెచ్చిపోవడం.. బెదిరించడం.. ఇప్పటి వరకు చూశారు. ఇప్పుడు.. ఆ నాయకుల అండదండలు చూసుకుని.. వారి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారు. ఏకంగా… హత్యలు చేస్తామం టూ.. బెదిరింపులకు దిగుతున్నారు.
తాజాగా.. కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లోని సుజాత ఆసుపత్రి సిబ్బందిపై.. వైసీపీ యువ నాయకుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు రెచ్చిపోయాడు. దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.. మర్డర్లు చేయడం నా వృత్తి.. నన్నే డబ్బులు అడుగుతారా? అంటూ.. వీరంగం వేశాడు.
బాషా అనే ఓ వ్యక్తి గర్భిణి అయిన తన కుమార్తెతో ఆస్పత్రికి వచ్చారు. రక్తస్రావం, నొప్పులతో బాధపడుతు న్న ఆమెను.. సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. అనంతరం బిల్లు చెల్లించాలని అడగ్గా, వారిపై బాషా దౌర్జన్యం చేశారు. తన అనుచరులను వెంటబెట్టుకొచ్చి సిబ్బందిపై దాడి చేశారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సుజాత ఆసుపత్రి సిబ్బందిపై వైకాపా నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్ బాషా దాడికి పాల్పడిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యురాలు సుజాత కథనం మేరకు.. ‘ముచ్చుమర్రికి చెందిన బాషా బుధవారం ఐదు నెలల గర్భిణి అయిన తన కుమార్తెతో ఆసుపత్రికి వచ్చారు. రక్తస్రావం, నొప్పులతో బాధపడుతున్న ఆమెను సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకుని పరీక్షలు చేసి, చికిత్స అందించారు. బిల్లు చెల్లించాలని అడగ్గా, వారిపై బాషా దౌర్జన్యం చేశారు. తన అనుచరులను వెంటబెట్టుకొచ్చి సిబ్బందిపై దాడి చేశారు. నాపైనా దుర్భాషలాడారు. అని తెలిపింది.
‘మర్డర్లు చేయడం నా వృత్తి. నన్నే డబ్బులు అడుగుతారా? మిమ్మల్ని చంపేస్తా’ అని భయపెట్టారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనిషినని, తాను తలచుకుంటే సాయంత్రానికి ఆసుపత్రి లేకుండా చేస్తానని బెదిరించారు’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సుజాత వివరించారు. గురువారం సాయంత్రం సిద్ధార్థరెడ్డి అనుచరులు, యాదవ సంఘం నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసు లేకుండా రాజీ చేసేందుకు మంతనాలు సాగించారు.
నందికొట్కూరు పోలీసులు.. వైద్యురాలు, సిబ్బంది స్టేషన్కు వచ్చారని, ఫిర్యాదు పత్రంపై సంతకం లేదన్నారు. సంతకం కోసం పోలీసులను ఆసుపత్రికి పంపినా, సంతకం చేయలేదని చెప్పారు. అంటే… మొత్తానికి వైసీపీ అనుచరుడి బెదిరింపుతో.. హడలి పోయి..కేసులు పెట్టలేని పరిస్థితి దాపురించిందని.. స్తానికులు విమర్శిస్తున్నారు. జగనన్న పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా? అంటున్నారు.
https://twitter.com/SreenivasC14/status/1512030637452312588