ఇప్పుడు బీహార్ ఎన్నికలు నితీష్ కుమార్ తేజస్వి మధ్య జరగడం లేదు.
ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతోంది తేజస్వి మోడీ మధ్య, ఇదే విషయం మోడీ చెప్పకనే చెప్పాడు. జంగల్ రాజ్ కా యువరాజ్ అని తేజస్విని సంభోదించి.
తేజస్వి ఎప్పుడైతే పది లక్షల ఉద్యోగాలు అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే అని ప్రకటించిన మొదట్లో బిజెపి, జేడీయూ నేతలు అపహాస్యం చేశారు. చివరకు నితీష్ అయితే ఏ డబ్బులు కోసం అయితే నీ బాబు జైలుకు వెళ్ళాడో అవి తెచ్చి జీతాలు ఇస్తావా అని, అయితే యువతలో మార్పు కనపడింది. తేజస్వి మాటలను నమ్మడం మొదలైంది.
దాంతో నితీష్ కుమార్ ఎప్పుడూ లేని విధంగా దిగజారిపోయి విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. దాంతో ప్రజలు నితీష్ కుమార్ ను అసహ్యించుకోవడం మొదలు పెట్టారు. ఇది ఒకరకంగా బిజెపికి సంతోషంగా ఉన్నప్పటికీ లోలోపల కాస్త భయం కూడా మొదలైంది. సంతోషానికి కారణం ఎలాగైనా ఈసారి నితీష్ రాజకీయానికి పుల్‌స్టాప్ పెట్టాలనే వారి ఎజెండాకు ఊతం ఇచ్చేదైతే, భయానికి కారణం ఒకవేళ ఉద్యోగాల అంశం ప్రజల్లోకి వెళ్ళి తేజస్వి ఎన్నికల్లో విజయం సాధిస్తే, అది బీహార్ కు పరిమితము కాదు. మెల్లగా దేశ వ్యాప్తంగా పాకుతుంది. ఇప్పటి వరకు మతం అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందడం ఒక ఎత్తు అయితే, తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను తమ మిత్రులకు ఏవిధంగా కట్టబెడుతు యువత ఉద్యోగ ఉపాధికి గండి కొడుతున్నారనే అంశం ముందుకు వస్తుంది. దాంతో బిజెపికి రాజకీయ పుట్టగతులు ఉండవు.
అందుకే మెల్లగా తాము తేజస్వి కంటే ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మొదలు పెట్టారు. ఇక్కడ మరింతగా యువత వ్యతిరేకం కావడం మొదలైంది. నిన్నటి వరకు తేజస్వి ఎలా ఉద్యోగాలు ఇస్తాడని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు తాము ఎలా ఇవ్వగలరని అడగడం మొదలు పెట్టారు. అంతేకాకుండా నితీష్ సభలకు వెళ్ళి లాలూ జిందాబాద్, నితీష్ ముర్ధాబాద్ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు.
దాంతో ఏం చేయాలో పాలుపోక ఆర్జేడీ వస్తే జంగల్ రాజ్ వస్తుందని భయపెట్టడం మొదలు పెట్టారు. నిన్న జరిగిన మోడీ సభలకు వచ్చిన జనాలను చూస్తేనే అర్థం అవుతుంది. అసలు వచ్చిన జనాలు చాల తక్కువ పైగా వాళ్ళు మోడీ ప్రసంగం మొదలు పెట్టగానే చాలామంది వెళ్ళిపోయారు.
వీటన్నింటి మధ్య బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈవీఎంలు మీద నమ్మకం లేదు. ఏదైనా జరగవచ్చనే అనుమానం ఉంది వాళ్ళలో. దాని గురించి ఎవరికైనా ఫిర్యాదు చేస్తే బిజెపి వాళ్ళు కొడతారనే భయాన్ని కొన్ని చోట్ల వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి నాయకులు International Airports, Next Generation IT hubs అంటూ రకరకాలగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడ యువత అంటున్నది ఏమంటే, చాల్లే ఊరుకోండి ఉన్న విమానాశ్రయాలు అమ్ముకుని తాము తిరగడానికి విమానాలు కొనుక్కుంటున్నారని అంటున్నారు