దేశంలో తాజాగా జరిగిన ఎన్నికలు, వచ్చిన ఫలితాలు.. బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. చాలా చోట్ల బీజేపీ దూసుకుపోయింది. అయితే, ఈ ఫలితాలు.. ముఖ్యంగా బీజేపీ దూకుడు.. వంటివి ఆయా రాష్ట్రాల్లో ని ప్రతిప క్షాలను, ఇతర పార్టీలను ఏమేరకు కలవరపరిచాయో తెలియదు కానీ.. ఈ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని .. అసలు ఎన్నికలే జరగని ఏపీలో మాత్రం అధికార పార్టీకి గుబులు రేపాయి.
అందునా అధికార పార్టీ వైసీపీని మరింతగా ఈ ఎన్నికలు అంతర్మథనంలోకి నెట్టేశాయి.
దీనికి కారణం ఏంటి?
ఏమాత్రం సంబంధం లేని అంశంపై వైసీపీ ఎందుకు కలవరపడుతోంది?
అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. ఏపీలో తమ సర్కారు బలంగా ఉండాలంటే.. ప్రజల మన్ననలు పొందాలి.
ఇలా పొం దాలంటే.. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టాలి.
దీనికి సంబంధించి కేంద్రం పై పోరాడాలి. అయితే, పోరాడి సాధించుకునే పరిస్థితిని వైసీపీ అధినేత జగన్ ఏనాడో వదిలేసుకున్నారు.
తన చుట్టూ ముసురుకున్న కేసులు.. ఇతరత్రా అంశాలతో .. కేంద్రంలోని ప్రభుత్వంపై పోరాటం అంటూ .. తిరుగుబట్టు జెండా ఎగరేస్తే..
వారు జైలు జెండా ఎగరేసే అవకాశం ఉందని భావించి మౌనం పాటిస్తున్నారు.
అయితే… ప్రజల్లో మాత్రం ఇది తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా.. ఏమీ సాధించలేక పోయారనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది.
మరి ఏం చేయాలి? వైసీపీలో ఆలోచన ఇదే! కేంద్రంలో ఉన్న బీజేపీ బలహీనపడితే.. ఈ అంశాన్నిఅడ్డు పెట్టుకుని.. తాము మద్దతివ్వడం ద్వారా (ఒకరకంగా బ్లాక్మెయిల్) ఏపీకి సంబందించిన అంశాలపై ఒత్తిడి పెట్టొచ్చనేది జగన్ వ్యూహం.
నిజానికి ఇది వ్యూహమే కాదు.. ఆయన చేస్తున్న ఆలోచనే ఇది.
గత ఏడాది ఎన్నికలు పూర్తయి.. ప్రధానిగా నరేంద్ర మోడీని విష్ చేయడానికి వెళ్లిన తర్వాత.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన తొలి ప్రసంగంలోని కీలక అంశం కూడా ఇదే!
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి పూర్తి మెజారిటీ రాకూడదని చాలా మంది దేవుళ్లకు మొక్కుకున్నాను అని జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
అంటే.. బీజేపీ ఎదగడం జగన్కు సుతరామూ ఇష్టం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ .. తెలంగాణలో దుబ్బాక ఉప పోరులోనూ కూడా బీజేపీ ఓడిపోవాలనే ఆ పార్టీ నాయకులు కోరుకున్నారు.
ఎంత బీజేపీ తగ్గిపోతే.. అంతగా తాము ఆపార్టీపై ఎక్కి.. ఆడించొచ్చనేది జగన్ వ్యూహం.
కానీ, ఇప్పుడు వైసీపీ అనుకున్నదానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి.
బీజేపీ అన్ని చోట్లా పుంజుకుంది. దుబ్బాకలోను, బిహార్లో మరియు మధ్యప్రదేశ్ ఉపఎనికలోను నూ కూడా ఊహించని గెలుపు.
దీంతో వైసీపీ గొంతులో వెలక్కాయపడినట్టు అయింది.
బీజేపీ మరింత బలం పుంజుకుంటే.. తమ పప్పులు ఉడకవని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
వైసీపీ అనుకుంది ఒకటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బులుగు పిట్ట !
ముందు ముందు ముసళ్ళ పండగే పాపం !