https://twitter.com/DivakarReddyTPT/status/1434562242222034944
బిగ్ బాస్ తెలుగులోకి వస్తోందంటే చాలా మంది సర్ ప్రైజ్ అయ్యారు, సంతోష పడ్డారు.
కానీ సీజన్ సీజన్ కి దాని క్రేజు తగ్గిపోతూ వస్తోంది.
అసలు బిగ్ బాస్ షో అనేది క్రియేట్ అయ్యిందే సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవాలన్న జనాల ఆసక్తి నుంచి పుట్టింది.
కానీ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికను చూస్తుంటే… బిగ్ బాస్ సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రతి సీజన్ కి దిగజారిపోతుంది.
ఎక్కువమంది ఎవరో తెలియని అనామకులే. వారిని జనం ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారన్నది అర్థం కావడం లేదు.
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న మొహం … ప్రియ మాత్రమే.
మిగతా వారిలో అంతో ఇంతో తెలిసిన వ్యక్తి టీవీ షోల్లో జడ్జిగా వచ్చే డ్యాన్స్ మాస్టర్ యానీ. ఈమె తెలుగు వారికి బాగానే పరిచయం. యానీ మాస్టర్ ఇక్కడే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పుట్టింది. మాస్ అయినా క్లాస్ అయినా డ్యాన్స్‌తో ఇరగదీసే ఆమె బిగ్‌బాస్ షోలో తన ఎనర్జీతో అందరికీ చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
విరతో పాటు మరో ఇద్దరు ముగ్గురు తప్ప…. మిగతావాళ్లు యూట్యూబర్స్, టిక్ టాకర్స్. అందుకే కంటెస్టెంట్ల ఎంట్రీ అయిపోగానే సోషల్ మీడియా కంటెంస్టెంట్లను విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఏం కర్మరా ఇది వీరి బాగోతాన్ని గుడ్లప్పగించి చూడాలా? ఎవర్రా వీళ్లంతా అంటున్నారు నెటిజన్లు.
వీరి గురించి నెటిజన్లు ఏమని ట్రోల్ చేస్తూనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు