యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం సరయు ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 7 ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్ లో బోల్డ్ వీడియోలు, బూతు, డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయే సరయు…హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని కేసు నమోదు కావడం సంచలనం రేపింది. సిరిసిల్లలో 7 ఆర్ట్స్ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో సరయుతో పాటు ఆమె టీం మెంబర్స్…తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లను కట్టుకొని మద్యం సేవించినట్లు షూట్ చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
మహిళలను, హిందూ సమాజాన్ని కించపరిచేలా ఆ వీడియోలోని సన్నివేశాలున్నాయంటూ సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్…సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, బంజారా హిల్స్ పోలీసులకు సిరిసిల్ల పోలీసులు విషయం చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు సరయును బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆమెను, ఆ పాటకు సంబంధించి సరయు టీంలోని సభ్యులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.
7 ఆర్ట్స్ పేరుతో యూబ్యూట్ చానెల్ నడుపుతోన్న సరయుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ ప్రత్యేకమైన యాసతో మాట్లాడడం, అడల్డ్ కంటెంట్ ను పోలి ఉండేలా డబుల్ మీనింగ్ డైలాుగులు, బూతులతో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ ను అప్ లోడ్ చేయడం, వాటిలో నటించడం సరయు అండ్ టీం కు అలవాటు. ఇక సరయు వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ బోల్డ్ వీడియోలు, బూతులతో సరయుకు వచ్చిన క్రేజ్ ను చూసే ఆమెను బిగ్ బాస్-5 తెలుగులో 13వ కంటెస్టెంట్ గా తీసుకున్నారు నిర్వాహకులు. అయితే, వచ్చిన వారానికే సరయు ఎలిమినేట్ కావడంతో హౌస్ లో సరయు విశ్వరూపం చూసే చాన్స్ మిస్సయింది.