బిగ్ బాస్ తెలుగు సీజన్-5 రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. హౌస్ లో కొందరు లేడీ కంటెస్టెంట్ల సిగపట్లు ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నాయి. దీంతో, ఏ వారం ఎవరికి ఎన్ని ఓట్ల పడతాయో…ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న టెన్షన్ ఇటు హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం నాడు లహరి షో నుంచి ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు షాకయ్యారు..
ఓటింగ్‌లో లహరికి తక్కువ ఓట్లు పడటంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయింది. అయితే, ఈ వారం నామినేషన్స్ సందర్భంగా ప్రియ, లహరి, రవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రియ చేసిన వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. ఇక, ఎలిమినేట్ అయిన లహరి బిగ్‌బాస్‌లో తన జర్నీ తలచుకొని ఎమోషనల్ అయింది. ఎలిమినేషన్ సందర్భంగా ఫెయిల్ అయిన ఐదుగురి గురించి చెప్పాల్సిందిగా నాగ్ కోరగా….అందరి గురించి చెబుతానంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి తన అభిప్రాయాలు…సీక్రెట్స్ చెప్పేసింది లహరి.
సిరి: చాలా మంచిది. అమ్మాయిలంటే ఇన్‌సెక్యురిటీ!
అనీ: స్వీట్ మామ్. మీతో ఇంకొంత కాలం ప్రయాణం చేయాలి.
రవి: కెమెరాలున్నాయి జాగ్రత్త!
ప్రియ: సందర్భానుసారం మన మధ్య గొడవ జరిగింది. మీపై కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు.
శ్రీరామ్: చాలా సూపర్. నీ గురించి నువ్వు ఆలోచించు.
విశ్వ: స్ట్రాంగ్‌గా ఉండు.
లోబో: నీ ఈక్వెషన్స్ మారిపోయాయి లోబో! మనం అనుకునేవీ ఏవీ జరగవు. జనాలు వేరే అనుకుంటున్నారు.
నటరాజ్ మాస్టర్: నిజంగా బోళా శంకరుడు! ఆయనకు ఏమీ తెలియదు.
శ్వేత వర్మ: చాలా ధైర్యంగా ఉండు. నేను లేనని భయపడవద్దు!
కాజల్: కెమెరాలున్నాయి జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించు.
షణ్ముఖ్: చిన్న నిర్ణయాలు పెద్ద తప్పులకు దారి తీస్తాయి. ఏ నిర్ణ్రయం తీసుకున్నా ఆలోచించు. సిరి నామినేట్ చేసిందని నన్ను నామినేట్ చేశావు.
జెస్సీ: చిన్న పిల్లాడు. ఏమీ తెలియదు.
సన్నీ: అన్నీ తెలుసనుకుంటాడు. ఇంట్లో వాళ్ల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. చాలా షార్ప్ అనుకుంటాడు. అంతేమీ కాదు.
మానస్: పెద్దగా ఏమీ తెలుసుకోలేకపోయా. ఈలోపే బయటకు వచ్చేశా!
ప్రియాంక: ప్రియాంక ఒక స్ఫూర్తి! ఆమెలా నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో చాలా ఎత్తులో ఉంటా.
హమీదా: సూపర్ స్ట్రాంగ్ లేడీ. ఎలా ఉన్నావో అలాగే ఉండు!