ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం… అది ఎన్నికల కమిషన్ నిర్ణయమని, ప్రభుత్వం దానిని ప్రభావితం చేయలేదని తేల్చేసింది.
ఇది జగన్ కి రుచించని అతి పెద్ద పరిణామం, ఎపి హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును రద్దు చేయడంతో జగన్ టీం కలవరానికి గురైంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆలోచన ప్రకారమే ఎన్నికలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, AP స్టేట్ ఎలక్షన్ కమిషన్ (APSEC) డివిజన్ బెంచ్‌ను సంప్రదించిన కేసులో ఈ సంచలన తీర్పువెలువడింది. మూడు రోజులుగా.. డివిజన్ బెంచ్ ప్రభుత్వం – ఎపిఎస్‌ఇసి వైపుల ఇరువురి వాదనలు విన్నది. సమగ్ర మరియు వివరణాత్మక విచారణల తరువాత, AP హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది.
కోవిడ్ -19 ముందు జాగ్రత్త చర్యలతో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని ఎపి హైకోర్టు ఎపిఎస్ఇసిని ఆదేశించింది. దీనితో, APSEC ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 4 వ తేదీ నుండి స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతాయి.
కొసమెరుపు- తాజా తీర్పు వైసీపీ పార్టీకి పెద్ద అవమాన భారాన్ని మిగిల్చింది. దీంతో AP హైకోర్టు యొక్క తాజా నిర్ణయంపై YCP ప్రభుత్వం సుప్రీంకోర్టును సంప్రదించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… ఈ కేసులో అక్కడికి వెళ్లినా జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో మొదట్నుంచి స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్‌లో వేలుపెట్టడం వైసీపీ తప్పిదంగానే సుప్రీంకోర్టు గుర్తించింది. ఇప్పటికే ఈ వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నాయి.
స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఆపడానికి సహేతుక కారణాలు లేవన్న న్యాయస్థానం
రాజ్యాంగంలోని 9, 9ఏ షెడ్యూల్ ప్రకారం కాల పరిమితిలోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి
తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్న హైకోర్టు
ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్ దే
కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఎలాంటి అధికారాలున్నాయో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అలాంటి అధికారాలు ఉన్నాయి
సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది
ఎన్నికల కమిషన్ కు దురుద్ధేశాలు ఆపాదించడం సరికాదన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం
స్థానిక ఎన్నికలు జరిగితేనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తారన్న హైకోర్టు
వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా కోరడంలో సహేతుకత లేదు
మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహణ సబబే
అమెరికాతోపాటు మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని గుర్తు చేసిన ధర్మాసనం
ఇప్పటికే రెండున్నరేళ్లుగా స్థానిక ఎన్నికలు జరగలేదన్న న్యాయస్థానం
వ్యాక్సినేషన్ పేరుతో 2022 వరకు ఎన్నికలు నిర్వహించరాదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందన్న హైకోర్టు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్న ధర్మాసనం
కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకించిన హైకోర్టు