టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబరు 2న నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. దాంతోపాటు, అక్టోబరు 2వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాలపాటు ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆపి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ కు నిరసన వెలిబుచ్చాలని పిలుపునిచ్చారు.
నంద్యాలలో జరిగిన పార్టీ మీటింగ్ లో అచ్చెన్న ఈ విషయాలు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల వల్ల 97 మంది చనిపోయారని, వారికి సంతాపం తెలియజేశామని అచ్చెన్న చెప్పారు. త్వరలోనే టీడీపీ, జనసేన జేఏసీ ఏర్పాటవుతుందని, రాష్ట్రస్థాయిలో ఉండే ఆ జేఏసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుందని అన్నారు. ఇక, టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసేన మద్దతు పలికిన సంగతి తెలిసిందే. వారాహి యాత్రకు కూడా టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని బాలయ్య బాబు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి 5 రోజుల పాటు ఖరారైందని నాదెండ్ల మనోహన్ వెల్లడించారు.