అమరావతి డిజైన్లను చంద్రబాబు గీయిస్తే గ్రాఫిక్స్ బాబు అన్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఒక చిన్న అపార్ట్ మెంట్ కట్టినా నమూనా ఆర్కిటెక్చర్ గీయిస్తారు. ప్లాన్ లేకుండా ఏమీ కట్టరు. అది తెలిసినా కేవలం చంద్రబాబును బదనాం చేయాలనే లక్ష్యంతో గ్రాఫిక్స్ అనే ప్రచారం చేసి అమరావతిపై కక్ష కట్టారు వైసీపీ, మరియు జర్నలిస్టు ముసుగుల్లో ఉన్న ఆ పార్టీ సభ్యులు. పెద్ద నిర్మాణాలు కట్టడం కంటే ప్లానింగ్ కే ఎక్కువ సమయం పడుతుంది. ప్లానింగ్ అనేది బ్రెయిన్ వర్క్, కట్టడం అన్నది ఫిజికల్ వర్క్. ఈ కనీస ఆలోచన లేకుండా బదనాం చేయడం అన్నది పొలిటికల్ వర్క్.
నిన్ననే లోక్ సభ స్పీకర్ ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంటు భవన నమూనాని ప్రదర్శించారు. జాతీయ అంతర్జాతీయ మీడియాను పిలిచి కట్టబోయే బిల్డింగ్ గురించి వివరించారు. డిసెంబర్ 10 న కొత్త పార్లమెంట్ భవనం యొక్క భూమి పూజను నిర్వహిస్తారు. 2022 అక్టోబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మన స్వాతంత్రానికి 75 వ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా, కొత్త పార్లమెంటులో సెషన్ జరుగుతుంది.
బిల్డింగు ప్రత్యేకతలు
నాలుగు అంతస్తులుగా ఏర్పాటు చేసిన 970 కోట్ల రూపాయల కొత్త పార్లమెంట్ భవనం యొక్క మొత్తం అంతర్నిర్మిత ప్రాంతం సుమారు. 64500 చదరపు మీటర్లు. ప్రస్తుత భవనంతో పోలిస్తే ఇది 17000 చదరపు మీటర్లు ఎక్కువ.
కొత్త పార్లమెంట్ భవనంలో, లోక్‌సభ ఛాంబర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మరియు 888 మంది సభ్యులు కూర్చునే ఏర్పాట్లుంటాయి. అంటే భవిష్యత్తుల్లో పార్లమెంటు సీట్లు పెంచినా సరిపోతుంది. ఇక రాజ్యసభ ఛాంబర్లో 384 మంది సభ్యులు కూర్చుంటారు. అంతేకాకుండా, ఉమ్మడి సమావేశాలలో, 1272 మంది సభ్యులు ఛాంబర్లో కూర్చోగలరు.
ప్రస్తుత భవనం కొత్తది నిర్మించిన తరువాత కూడా వాడుకలో ఉంటుంది. నిర్మాణ పనుల సమయంలో ఉన్న ప్రాంగణంలోని వారసత్వ లక్షణాలను కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
కొత్త భవనం నిర్మాణం ద్వారా ఒరిజినల్ పార్లమెంటు దృశ్యమానత అస్పష్టంగా ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం ఉన్న విగ్రహాలన్నీ తగిన విధంగా మార్చబడతాయి. అంటే విగ్రహాల ప్లేస్ మారుతుంది.