బే ఏరియాలో “భీమ్లా నాయక్” ఫివర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాలు లీడ్ రోల్ లో తెరకెక్కిన “భీమ్లా నాయక్” నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో, సినిమాపై పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానులూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా “భీమ్లా నాయక్” హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతోంది.
ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాకూ “భీమ్లా నాయక్” ఫివర్ పాకింది. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో బే ఏరియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ 27వ సినిమా అయిన భీమ్లా నాయక్ కు గుర్తుగా బే ఏరియాలోని పవన్ అభిమానులు, జనసేన అభిమానులు… పవన్ ఫొటోకు 27 కొబ్బరికాయలు కొట్టి పండుగ చేసుకున్నారు. బే ఏరియాలోని పవన్ అభిమానులతో పాటు, టీడీపీ సానుభూతిపరులు, సినీ అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బే ఏరియాలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ అమెరికాలో భీమ్లా నాయక్ ఫీవర్ మరింత పెరగనుంది. మురళి గోడవర్తి, వీరబాబు ప్రత్తిపాటి, ప్రసాద్ మంగిన, సుబ్బా రావు తలచిరు, శ్రీనివాస్ దామరాజు, శైలేందర్ గడ్డం, రాజశేఖర్ కొండా, శివ ప్రసాద్ పరుచూరి , శ్రీకాంత్ దొడ్డపనేని, సతీష్ బొల్లా, మధు గార్లపాటి, అజయ్, సాయి, సందీప్, ప్రకాష్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.