హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీని నేడు 80 దేశాల రాయబారులు , హైకమిషనర్ల బృందం సందర్శించనుంది . కరోనా వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనను విదేశీయులకు తెలియజేసే ఉద్దేశంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది . ఉదయం 10 గంటలకు వారు హైదరాబాద్ చేరుకోనున్నారు . కాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ .. మానవులపై రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది . మూడో ట్రయల్స్ చివరి దశలో ఉంది .