క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తరపున బీసీ నేతలు రంగంలోకి దిగటం దాదాపు ఖాయమైపోయింది.
బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈటల రాజేందరే అభ్యర్ధన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
ఇక టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ ను పోటీలోకి దింపనున్నట్లు కేసీయారే ప్రకటించేశారు.
ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ తరపున మాజీమంత్రి కొండా సురేఖ ఉపఎన్నికలో పోటీ చేయటం దాదాపు ఫైనల్ అయిపోయిందట.
అభ్యర్ధి విషయంలో భేటీఅయిన పీసీసీ సమన్వయకమిటి కొండా పేరును అధిష్టానానికి సిఫారసు చేసినట్లు సమాచారం.
కొన్నిపేర్లను పరిశీలించినప్టికీ బీసీ నేతైన కొండా సురేఖ అయితే బాగుంటుందని భేటీ నిర్ణయానికి వచ్చిందట.
ఈ పేరుకు పార్టీ అధిష్టానం ఓకే చెబితే అప్పుడు మూడు పార్టీల తరపున పోటీచేయబోయేది బీసీ నేతల అవుతారు.
అప్పుడు పోటీ బాగా టైటుగా ఉంటుందనే చెప్పాలి.
నియోజకవర్గంలో బీసీల ఓట్లు సుమారు 1 లక్షకుపైగా ఉన్నాయి. అలాగే ఎస్సీల ఓట్లు 45 వేలదాకా ఉన్నాయి.
మిగిలిన సామాజికవర్గం ఓట్లు మరో లక్షకుపైగా ఉంటాయి. అందుకనే అన్నీపార్టీలు బీసీ జపం చేస్తున్నాయి.
కాకపోతే కేసీయార్ కాస్త తెలివిగా దళితుల ఓట్ల కోసం దళితబంధు పథకాన్ని ప్రకటించారు. అయితే ఇపుడా పథకం చుట్టూ చాలా గొడవలు జరుగుతున్నాయి.
కాబట్టి కేసీయార్ దళితబంధు వ్యూహం ఓట్లు తెస్తుందో లేకపోతే బెడిసికొడుతుందో చూడాల్సిందే.
మొత్తంమీద రాష్ట్రంలోని బీసీ సంఘాల నేతలంతా మూడుపార్టీల తరపునా హుజూరాబాద్ లో మోహరించటం ఖాయమైపోయింది.
మళ్ళీ బీసీల ఓట్లకోసం ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాలను రచించుకుంటోంది.
అలాగే దళితుల ఓట్లకోసం కూడా ఏపార్టీకదే వ్యూహాలను అనుసరిస్తోంది. మరి ఏపార్టీ వ్యూహం వర్కవుటవుతుందో ఏమో తెలీటంలేదు. చూద్దాం చిరవకు ఏమి జరుగుతుందో.