తెలుగువారి పెద్దపండుగ.. ఇంటిల్లిపాదీ ఎంతో ఘనంగా చేసుకునే చూడముచ్చటైన పండుగ సంక్రాంతి.
తెలుగు వారు ఎక్కడున్నా.. ఏ దేశంలో ఉన్నా ఘనంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి.
అగ్రరాజ్యం అమెరి కాలో ఉన్నా.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, మూలాలను మరిచిపోకుండా.. అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తోంది.. బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా).
ఈ పరంపరలోనే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను కూడా `బాటా` ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెలుగువారు ఎక్కడున్నా తమ సంస్కృతిని మరిచిపోరు అన్నట్టుగా.. సంక్రాంతికి శోభ చేకూర్చే ప్రతి కార్యక్రమాన్నీ ఎంతో సంబరంగా.. ఉత్సాహంగా.. నిర్వహించారు.
రంగవల్లులను తీర్చిదిద్దడం నుంచి వంటల పోటీలు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, సంగీత కచేరీలు, డ్యాన్స్, జానపద నృత్యాలు, ప్రఖ్యాత స్టేజ్ గేమ్.. సహా అనేక పోటీలు నిర్వహించారు.
బాటా ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సుమారు 1000 మందికిపైగా అతిథులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన సంబరాలు.. రాత్రి 10 గంటల వరకు ఎంతో సంబరంగా.. అంబరా న్ని తాకేలా సాగడం గమనార్హం. వేదికను చూడముచ్చటగా అలంకరించారు.
సంక్రాంతి సంప్రదాయం ఉట్టిపడేలా.. విభిన్న రకాల రంగు లతో బ్యాక్‌డ్రాప్‌ను ఏర్పాటు చేశారు.
రంగురంగుల పతంగులను కూర్చి.. వేదికను చాలా భిన్నంగా తీర్చి దిద్దారు.
వేదికను తీర్చిదిద్దడంలోనూ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించడంలోనూ బాటా ప్రతినిధులు, వలంటీర్లు ఎంతో శ్రమించారనడంలో సందేహం లేదు.
“పాటల పల్లకి“ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ప్రారం భమయ్యాయి.
బాటా కిర్రాక్.. టీం నుంచి గాయకులు పాల్గొని కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు.
`పాఠశాల` తెలుగు స్కూల్(తానా-బాటా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు భాష స్కూల్) విద్యార్థులు పాల్గొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అదేవిధంగా సూపర్ చెఫ్ పోటీ కింద వంటల కార్యక్రమాలు.. రంగవల్లి పోటీలు, చిత్ర లేఖరం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
చిన్నారులకు కూడా వంటల పోటీలు నిర్వహించారు.
అదేవిధంగా బాటా టీం తంబోలా(హౌసీ) పోటీ నిర్వహించారు.
సాయంత్రం 5గంటలకు.. సాంస్కృతిక పోటీలను నిర్వహించారు.
చిన్నారులకు `భోగిపళ్లు` పోశారు.
వసుధైక కుటుంబం అనేలా..చిన్నారులు.. వారి తల్లిదండ్రులు అందరూ కలిసి వచ్చి.. సంక్రాంతి సంబరాలకు వన్నెలద్దారు.
గణతంత్ర వేడుకలు కూడా..
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఏఐఏ ఎన్నికైన అధికారులు.. ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అదేవిధంగా మట్ మహన్(మేయర్ శాన్ జోస్), మంటానో(మేయర్ మిల్పిటాస్), అలెక్స్ లీ(అసెంబ్లీ మెంబర్) అదేవిధంగా ఏఐఏ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు,యువత పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమాలకు `సంజయ్ టాక్స్ ప్రో` గ్రాండ్ స్పాన్సర్‌గా నిలిచింది.
రియల్టర్ నాగరాజ్ అన్నియ్య కూడా స్పాన్సర్‌గా నిలిచారు.
`శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్` గోల్డ్ స్పాన్సర్ చేయగా.. ఐసీఐసీ బ్యాంక్, పీఎన్జీ జువెల్లరీ, రైట్ కేర్, రియల్టర్ సాగర్ కొత్త, TASQA.AI, Sling(Dakshin) & ITU స్పాన్సర్లుగా కార్యక్రమానికి దన్నుగా నిలిచారు.
ఇక,అతిథులకు ఆహారాన్ని అందించే బాధ్యతను `బిర్యానీ జంక్షన్` తీసుకుంది.
ఈ కార్యక్రమాలను ముందుండి నడిపించిన `బాటా` వలంటీర్లను హరినాథ్ చికోటి(ప్రెసిడెంట్) అభినందించారు.
ఈ సందర్భంగా `బాటా` ఎగ్జిక్యూటివ్ కమిటీని హరినాథ్ చికోటి ప్రకటించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇదీ..
+ కొండల్ కొమరగిరి(ఉపాధ్యక్షులు)
+ అరుణ్ రెడ్డి(కార్యదర్శి)
+ వరుణ్ ముక్కా(కోశాధికారి)
+ శివ కడ(సంయుక్త కోశాధికారి)
స్టీరింగ్ కమిటీ సభ్యులు వీరే
+ రవి తిరువీధుల
+ కామేష్ మళ్లా
+ శిరీష బత్తుల
+ యశ్వంత్ కుదరవల్లి
+ సుమంత్ పసులూరి
కల్చరల్ డైరెక్టర్స్
+ శ్రీదేవి పసుపులేటి
+ శ్రీలు వెలిగేటి
+ తారక దీప్తి
నామినేటెడ్ కమిటీ
+ హరి సన్నిధి
+ సురేష్ శివపురం
+ శరత్ పోలవరపు
యువజన విభాగం కమిటీ
+ ఉదయ్
+ సంకేత్
+ ఆదిత్య
+ గౌతమి
+ హరీష్
+ సందీప్
`బాటా`సలహాదారుల బోర్డు
+ జయరాం కోమటి
+ విజయ ఆసూరి
+ వీరు వుప్పాళ్ల
+ ప్రసాద్ మంగిన
+ కరుణ వెలిగేటి
+ రమేష్ కొండా
+ కళ్యాణ్ కట్టమూరి