మ్యూజిక్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? పైగా తెలుగు వారి సంగీతానికి ఎల్లలు లేవు. `శిశుర్వే త్తి,` అన్నట్టుగా తెలుగు సంగీతం ఆసేతు హిమాచలం దాటి అగ్రరాజ్యంలోనూ అంబరమంటే స్థాయిని అందుకుంటున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ లో 50 వ వసంతం లోకి అడుగు పెడుతున్న ‘బే ఏరియా తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో `రామ్ మిరియాల` నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ గూస్ బంప్స్ పెట్టించింది.
శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. డీజే టిల్లు, చిట్టి, భీమ్లానాయక్, మాయా తదితర సినిమాల పాటలతో ఈ కార్యక్రమం విశేషంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కో ఇండియన్ కాన్సులెట్ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సతీసమేతంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని రామ్ మిరియాల`ని అభినందించారు.
శ్రీమతి విజయ ఆసూరి కార్యక్రమాన్ని తనదైన శైలి లో ఎంతో ఉత్సహంగా నడిపించారు.
స్థానిక తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు జయరాం కోమటి, బాటా అధ్యక్షుడు హరినాథ్ చికోటి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, కళ్యా కట్టమూరి, కరుణ్ వెలిగేటి, శ్రీదేవి,శ్రీలూ తదితరులు పాల్గొన్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ ఫైన్ జ్వల్లర్స్, కర్రీ పాయింట్, `నాగరాజ్` అన్నయ్యలు స్పాన్సర్స్‌గా వ్యవహరించారు.