నటరత్న, పద్మశ్రీ, తెలుగు వారి అన్నగారు ఎన్.టి.రామారావు శత జయంతి వేడుకలను పురస్కరించుకుని బే ఏరియా తెలుగు సంఘం(బాటా) ప్రత్యేక సంగీత నివాళులర్పించింది.
బాటా మ్యూజికల్ గ్రూప్ గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తోందని ప్రసాద్ మంగిన పేర్కొన్నారు.
ప్రతిభావంతులైన గాయకులకు గుర్తింపు తీసుకురావడంతోపాటు, వినూత్న వేదికను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన పాటలు పాడి శ్రోతలను అలరించిన గాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వహించింది.
కొండల్ కొమరగిరి(అధ్యక్షుడు), శివ కడ(వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్కా(కార్యదర్శి) , హరి సన్నిధి(జనరల్ సెక్రటరీ) తదితరులు నేతృత్వం వహించారు.
అదే విధంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్ మళ్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవళి, సుమంత్ పుసులూరి కూడా కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు సహకరించారు.
సాంస్కృతిక దర్శకులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి పాల్గొన్నారు.
నామినేటెడ్ కమిటీ సభ్యులు సురేష్ శివపురం, సందీప్ కేదార్శెట్టి, రవి పోచిరాజు, యూత్ కమిటీ సభ్యులు ఉదయ్, సంకేత్, ఆదిత్య, గౌతమి, హరీష్, సందీప్, బాటా సలహా బోర్డు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బృందాన్ని రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస మూర్తి(ITCLA) హాజరై నాయకులందరికీ సర్టిఫికెట్లను అందజేశారు.
గాయకులు వీరే..
శేష ప్రసాద్, అభినవ్, శివ కుమార్, రామ్ బాబు, అనురాధ, సునీత, శ్రీని తగిరీసా, స్నేహ చతుర్వేదుల, అనికా ప్రసాద్, కృతిక, స్వర, అక్షర, చేతన్ వాకడే, కనికా వాహి, తిరు గుడివాడ, రఘురామ్, నితిన్ తోమర్, రేణు తోమర్, బిందు పట్నాయక్, శరద్ కులకర్ణి, అంజలి, మయాంక్ ఆర్య, తేజేశ్వర్ సూపర్ హిట్ పాటలను ఆలపించి శ్రోతలను మైమరపింపజేశారు.
ఇదే వేదికపై గాన గంధర్వ, పద్మ విభూషణ్ ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ జయంతిని, సంగీత ద్రష్ట, పద్మవిభూషణ్ ‘ఇళయరాజా’ పుట్టిన రోజు కూడా ఘనంగా నిర్వహించారు.