హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా.. మీడియాలో ఉండాలని అనుకుంటున్నారో.. లేక ఇదో ఫ్యాషన్‌గా తయారైందో.. లేక ఎవరైనా రాజకీయ నేతలు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొడుతున్నారో.. తెలియదు కానీ, తెలంగాణలో వరుస ఘటనలు మాత్రం తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. రెండు రోజుల కిందట అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇది వివాదంగా మారి.. రాష్ట్రంలో చర్చకు దారితీసింది. ఇక, ఇప్పుడు తాజాగా నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనే వ్యక్తి తీవ్ర విమర్శలు చేయడం.. అనుచితంగా రియాక్ట్ కావడం వంటివి దుమారం రేపుతున్నాయి.
రాజేష్‌ను అరెస్టు చేయాలంటూ బాసర వాసులు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానికులు, విద్యార్థులు, అర్చకులు ఖండించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌ను అరెస్టు చేయాలంటూ నిర్మల్ జిల్లా బాసరలో ఆందోళన చేపట్టారు. వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్థానికులు, వ్యాపారస్థులు, విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. రాజేశ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్-భైంసా రహదారిపై రాస్తారోకోకు దిగడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. రాజేష్ మాత్రం.. అందుబాటులోకి రాలేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారని.. పోలీసులు తెలిపారు.
స్వామియే శరణం అయ్యప్ప
హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్,రెంజర్ల రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప స్వాముల తో కలిసి నిజామాబాద్ నగరంలో NTR చౌరస్తా లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.#ayyappaswamy #ayyappan #nizamabad #swamisaranamayyappa pic.twitter.com/TbEQBP77To— Dhanpal Suryanarayana (@Dhanpal_Suranna) December 31, 2022