ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కమ్మ కులంపై విషయం చిమ్ముతోన్న విజయసాయిరెడ్డిని విష సాయి అంటూ బండ్ల గణేశ్ బండ బూతులు తిట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్ వ్యాఖ్యలపై విజయసాయి స్పందించారు. అయితే, సాయిరెడ్డి వ్యాఖ్యలపై వెంటనే బండ్ల గణేష్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో అది వైరల్ అయింది.
‘ఆకులు, వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు’ అంటూ మండిపడ్డారు. ఎవరిని పడితే వాళ్లను కరవడం అంతే ఈజీ అనుకున్నావా? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావు. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లు అవుతాయిగానీ.. బండ్లు ఓడలు కాలేవు. అయ్యో.. గణేశా!’’ అంటూ బండ్ల గణేష్ ను ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ కు బండ్ల గణేష్….విజయసాయి దిమ్మదిగిరేలాల కౌంటర్ ఇచ్చారు.
“ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం. కష్టపడ్డాం. నీలా దోచుకోలేదు. దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి. మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ. అరెస్ట్ చేయిస్తారో, కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు.
ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలిచిన గంజాయి మొక్క మీరు. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది” అంటూ బండ్ల గణేష్ మరోసారి విజయసాయిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, బండ్ల గణేష్ వ్యాఖ్యలపై విజయసాయి తాజా స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.