టీడీపీ ఒక కుల పార్టీ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తిరుపతిలో జాబ్ మేళా సందర్భంగా విజయసాయి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ నిప్పులు చెరిగారు.
‘‘అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’’ అంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. విజయసాయి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, తమ కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లోకి లాగుతున్నారంటూ సాయిరెడ్డిని నిలదీశారు. తనకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం అని, సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో వాలని హితబోధ చేశారు.
అన్ని కులాల్లో మంచి వాళ్లు చెడ్డ వాళ్లు ఉంటారని, చంద్రబాబుతో రాజకీయ వైరం ఉంటే ఆయనతో తేల్చుకోవాలని హితవు పలికారు. తమ కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టాలని, కానీ, చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని,తాను కమ్మ అయినా..టీడీపీకి చెందినవాడిని కాదని ట్వీట్ చేశారు.
విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కోవాలని హితవు పలికారు. వ్యక్తి మీద కోపంతో కులాన్ని తిడితే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయిని జైలుకు పంపింది.. కమ్మ వారు కాదని, త్వరలో నువ్వు జగన్‌కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ తర్వాత తనను విజయసాయి ఎంత ఇబ్బందిపెడతారో తెలుసని, అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నానని బండ్ల గణేష్ అన్నారు. కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు అని సాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు బండ్ల గణేష్.
కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్న.. నీకు నచ్చనివారిని పేరు పెట్టి తిట్టు.. దయచేసి కులాన్ని తిట్టకు.. ఇదేనా నీ సంస్కారం ? అని ప్రశ్నించారు. నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు.. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావూ అంటూ మండిపడ్డారు.. జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు అని సూచించిన ఆయన.. నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తాను అని స్పష్టం చేశారు.
‘‘ఇక, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు.. అది నీకు మంచిది కాదు… టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు ? అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం.. విశాఖలో దోచుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నవు.. ఇది ప్రపంచానికి తెలుసని పేర్కొన్న ఆయన.. ఈ పిరికి ముసలి నా కొడుకిని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్లాక్ చేసి మింగుతాడు. వేస్ట్ గాడు..’’ అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు.
‘‘అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్‌కి జనం కారం పెట్టడం ఖాయం అని హెచ్చరించారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి’’ అంటూ మండిపడ్డారు. ఇక, తన ప్రతీ ట్వీట్‌ను విజయసాయిరెడ్డికి ట్యాగ్ చేశారు బండ్ల గణేష్. మరి, ఈ ట్వీట్లపై విజయసాయి రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.