వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ల మధ్య ట్విటర్ వార్ పీక్ స్టేజికి చేరింది. కమ్మ కులస్తులను సాయిరెడ్డి టార్గెట్ చేయడంపై మండిపడ్డ బండ్ల…విజయసాయిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో ఫోన్ పగిలిపోయిందని, చెప్పు తెగేలా కొట్టారని బండ్ల గణేష్ ను ఉద్దేశించి విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫోన్లు పగలడం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం తప్పు కాదు దొంగ సాయి… దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం దొంగ పని సాయి అంటూ కౌంటర్ ఇచ్చారు.
“నేను చాలా చిన్నవాడ్ని… నా మీద ఏమున్నా కోర్టు ఊరుకోదు. కానీ జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం, అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు అని గుర్తుపెట్టుకో దొంగ సాయి. అయినా చంద్రబాబు నా బాసా? నాకు నీతి నియమం ఉంది. నేను ఎప్పటికీ తెలుగుదేశానికి చెందినవాడ్ని కాదు. నీకో విషయం తెలియజేయాలి దొంగ సాయి…. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని. ఆ విషయం వైఎస్సార్ ఆత్మ కేవీపీని అడిగితే తెలుస్తుంది. నేను ఏ పార్టీనో ఆయనే చెబుతారు.’’అంటూ సాయిరెడ్డికి రిటార్ట్ ఇచ్చారు బండ్ల.
ఎవడో చెప్పిన మాటల్ని విని ట్వీట్లు చేయవద్దని, తనకు బతుకునిచ్చింది పవన్ కల్యాణ్ అని, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు బండ్ల. తాను తల్లిదండ్రులకు పుట్టానని, సాయిరెడ్డిలాగా నీతిలేని బతుకు బతకనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా నిజాయితీగా ఉంటానని, ఒకరినే అభిమానించి ప్రాణంపోయేదాకా ఒకరితోనే ఉంటానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
బండ్ల వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయి…కుక్క కాటుకు చెప్పు దెబ్బలు తప్పవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు. ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.’’అని విజయసాయి ట్వీట్ చేశారు.
‘‘నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు” అంటూ బండ్ల గణేష్ పై విజయసాయి విమర్శలు గుప్పించారు. మరి, విజయసాయి వ్యాఖ్యలపై బండ్ల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.