తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన తోటి విద్యార్థిని భగీరథ కొట్టాడని.. మహీంద్రా వర్సిటీ క్రమశిక్షణ సంఘం ఫిర్యాదు మేరకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు విశ్వ విద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దుండిగల్ పోలీసులు బండి భగీరథ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..
మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచారు. దుర్భాషలాడుతూ విద్యార్థిని సాయి భగీరథ్‌తో పాటు అతని స్నేహితులు కలిసి చితకబాదారు.
అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపించింది. పైగా మంత్రికి చెప్పినా నన్నేం పీకలేరంటు వ్యాఖ్యలు చేయడం వీడియోలో ఉంది. విద్యార్థిని తీవ్రంగా కొడుతూ, దుర్భాషలాడుతూ ఈ ఘటన మొత్తం వీడియో తీయడం గమనార్హం.
సంజయ్ తనయుడు గతంలోనూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో సంస్థ నుంచి యాజమాన్యం పంపేసిందనే వాదన ఉంది. తాజాగా నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో ఘటన ఇటు రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. దీనిపై అటు నెటిజన్లు.. ఇటు సోషల్ మీడియాలోను సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బండి భగీరథ మహేంద్ర విశ్వవిద్యాల యంలో మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నారు. అయితే.. బండి భగీరథ స్నేహితుడి చెల్లెల్ని వేధించినందుకే భగీరథ తనపై దాడి చేశాడని.. ఇందులో అతని తప్పేమీ లేదని శ్రీరామ్ వీడియోలో పేర్కొన్నాడు.
1.మహేంద్ర యూనివర్సిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ, తోటి విద్యార్థి శ్రీరాం పై దాడి. (Sorry for the Foul language)
2. అయితే తను ఒక అమ్మాయితో మిస్ బిహేవ్ చేసినందునే భగీరథ అలా రియాక్ట్ అయ్యాడంటున్న శ్రీరాం. pic.twitter.com/k3sCsD9krJ— Nellutla Kavitha (@iamKavithaRao) January 17, 2023