​ఎంఐఎం... ఒక ఉగ్రవాద సంస్థ - బండి సంజయ్

జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవడానికి  బీజేపీ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. టీఆర్ఎస్ - ఎంఐఎం స్నేహాన్ని ఎండగడుతూ బండి సంజయ్ నేతృత్వలోని బీజేపీ దూసుకుపోతోంది. ఎంఐఎం గెలిస్తే హైదరాబాదు పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఇప్పటికే రోహింగ్యాలకు హైదరాబాదును అడ్డాగా మార్చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

40 వేల మంది రోహ్యింగాలు హైదరాబాదులో పాతబస్తీలో స్థిరపడ్డారన్నారు. అయితే, తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు బండి సంజయ్.

ఎంఐఎం పార్టీ ఒక ఉగ్ర సంస్థ, పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులే ఎంఐఎంకు ఓటేస్తున్నారు... జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ గెలిచాక వెంటనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం.  రోహింగ్యాలను, పాకిస్థానీలను పాతబస్తీ నుంచి తరిమితరిమి కొడతాం అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.​​

బీజేపీ గెలిచాక  చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే తమ అడ్డా పెడతాం అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఉలిక్కిపడ్డారు. కేవలం కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సంజయ్ వ్యాఖ్యలను హోం శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.​

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.