ఏపీ ప్రభుత్వం అన్నీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుందో… ఎవరైనా తప్పు పడితే ప్రభుత్వంపై దాడి, జోక్యం అంటోంది. కేంద్రం నుంచి కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో 26 నుంచి జనవరి 1 వరకు రాష్ట్రంలో అన్ని రకాల వేడుకలు రద్దు చేసిందట ఏపీ సర్కారు. మరి అలాంటపుడు డిసెంబరు 25కు మినహాయింపు ఇచ్చి 26 నుంచి నిబంధనలు పెట్టడంలో ఉద్దేశం ఏంటి ప్రశ్నిస్తున్నారు జనం.
ఏపీలో ఇప్పటికే దీపావళికి పాక్షిక నిషేధం, వినాయక చవితికి పూర్తినిషేధం విధించింది ఏపీ ప్రభుత్వం. అలాగే జనవరి 1వ తేదీ కొత్త ఏడాది వేడుకలు, డిసెంబరు 31 ఫేర్ వెల్ వేడుకలు కూడా నిషేధం విధించింది. ఏకంగా కర్ఫ్యూ విధించింది. జనం గుమిగూడతారు కాబట్టి కరోనా వ్యాపించే అవకాశం ఉందని కారణం చెబుతోంది. క్రిస్మస్ కి పెద్ద ఎత్తున జనం గుమిగూడే అవకాశం ఉంది. చర్చిల్లో జనం భారీ ఎత్తున గుమిగూడతారు. అది కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతుంది కదా.
ఇలా పక్షపాత పూరిత నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు ? విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు? మళ్లీ దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే అక్కడ ఈ పక్షపాతాన్ని ప్రశ్నిస్తే… అన్నిట్లో కోర్టులు వేలు పెడతాయంటారు. కోర్టుల పని రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడటం. ప్రజలందరికీ ఒకటే రూల్ ఉండాలి. సమానత్వం దెబ్బతింటే కచ్చితంగా జనం కోర్టుల గడప తొక్కుతారు. అందులో ఏ సందేహం లేదు. అపుడు మళ్లీ నిర్ణయాలు మార్చుకోక తప్పదు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సలహాదారులు సీఎంకు సరైన సలహాలు ఇస్తే ఉపయోగం. ప్రస్తుతం ఏపీ సర్కారు విధించిన నిషేధంపై కనుక కోర్టుకు వెళితే నిషేధం విధిస్తే 25 నుంచే విధించండి, లేకపోతే అసలు నిషేధమే వద్దనే అవకాశం కచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం పక్షపాత పూరితం అని అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది.