పార్టీకి నష్టం వాటిల్లే అంశాల్ని రాజకీయ నేతలు ప్రస్తావిస్తారు. అందుకు తమ పార్టీ వేదికల్ని వినియోగించుకోవటం ఇప్పుడే వచ్చిన కొత్త కల్చర్ కాదు. కానీ.. తమ నేత తీరును తప్పుపట్టినా.. విమర్శించినా.. లోపాల్ని ఎత్తి చూపించినా సరే.. తాట తీస్తాం అన్న రీతిలో దాడులు చేస్తున్న వైనం పెను సంచలనంగా మారింది.
సొంత పార్టీ నేతను సైతం బండ బూతులు తిడుతూ.. ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ.. భయపడిపోతున్న నేత చెబుతున్న మాటల్ని వినకుండా ఇష్టారాజ్యంగా దాడి చేస్తున్న వైనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ హల్ చల్ చేస్తోంది. ఏపీ అధికారపక్షానికి చెందిన వైసీపీ నేతపై సొంత పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు జరిపిన దాడి ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ గా మారింది. ఇంతకూ ఆ వైసీపీ నేత ఎవరు? అతడు చేసిన తప్పేంటి? ఎందుకిలాంటి దాడి జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..
ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా ఒక వ్యాపారి. వైసీపీ సానుభూతి పరుడిగా.. ఆ పార్టీ ఫాలోయర్ గా చెబుతుంటారు. అలాంటి ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీకి కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. అంబటి రాంబాబు.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు నష్టం చేస్తున్నారని.. వారి వ్యాఖ్యలతో పార్టీకి 20 శాతం ఓటు బ్యాంకు నష్టం వాటిల్లుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీదా విమర్శలు చేశారు. ఆయన చుట్టూ ఉండే వారు సరైన వారు కారని.. ఆయన దగ్గరకు తీసుకునే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే పార్టీకి నష్టమన్నారు. ఈ తరహా వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిపోయిన బాలినేని వర్గీయులు సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లి రచ్చ చేసిన అనంతరం.. అతడు ఇంట్లో లేడని తెలుసుకొని.. అతడి ఆచూకీ కోసం వెతికినట్లుగా చెబుతున్నారు.
చివరకు లాడ్జిలో దాక్కుడున్నాన్న విషయాన్ని పసిగట్టిన బాలినేని వర్గీయులు.. అక్కడకు వెళ్లి పెద్ద సీన్ ను క్రియేట్ చేశారు. నా కొడకా.. నిన్ను చంపేస్తామంటూ చెలరేగిపోవటమే కాదు.. కాళ్లావేళ్లా పడినా కూడా దాడి చేశారు. పదే పదే ముఖం మీద కొట్టటం.. రాయలేని బూతుల్లో తిట్టటం చేశారు. సుభాని అనే అనుచరుడు.. అంతకంతకూ రెచ్చిపోతూ.. దారుణమైన బూతులు తిడుతూ.. పదే పదే కొడుతూ సుబ్బారావుపై దాడి చేశారు. నా..కొడకా వాసన్న గురించే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా? తప్పు అయ్యింది వాసన్న అని క్షమాపణలు చెప్పు అని బెదిరించారు.
తాను పార్టీకి సేవ చేశానని.. తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. ‘ఎవరికి రా చేసింది.. విశ్వాసం లేని కుక్కా. నా కొడకా.. నిన్ను చంపేస్తాను. ఎవరిగురించి మాట్లాడవురా’ అంటూ ముఖం మీద కొడుతూ దాడికి తెగబడ్డారు. ముగ్గురు పిల్లలు ఉన్నారంటూ ప్రాధేయపడినా.. వదిలిపెట్టుకుండా.. మోకాళ్ల మీద కూర్చోబెట్టి.. బండ బూతులు తిడుతూ రెండు చేతులు జోడించి.. వాసన్నా తప్పైంది.. క్షమించు అని చెప్పించారు.
ఈ మొత్తం తతంగాన్ని తనతో తీసుకొచ్చిన వ్యక్తుల చేత వీడియో తీయించిన బాలినేని అనుచరుడు సుభాని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుప్తాపై జరిగిన దాడికి ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి.
మరోవైపు సొంత పార్టీ సానుభూతిపరుడ్ని ఇలా కొట్టటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమర్శలు చేస్తే ఇంతలా దాడి చేయటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. వైసీపీ చోటా నేతగా గుర్తింపు పొందిన సుబ్బారావు గుప్తాకు మతిస్థిమితం లేదని.. ఆ విషయాన్ని అతడి భార్యనే చెప్పిందంటూ మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు విస్మయానికి కలిగిస్తున్నాయి.
ఒకవేళ అదే నిజమైతే.. పిచ్చోడి మాటలకు అంతలా రెచ్చిపోవటం దేనికి? మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి చేసే సభాని అండ్ కోకు గడ్డిపెట్టాలి కదా? అన్నది ప్రశ్నగా మారింది.
ఏపీలో పరిస్థితికి అద్దంపట్టే సంఘటనలు
మాస్కలు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ఈరోజు బతికిలేడు
ఆడవాళ్ళని తిట్టడటం తప్పు అని సొంత పార్టీ నాయకులకి సలహా ఇచ్చినందుకు వైశ్య నాయకుడు గుప్తా పరిస్థితి ప్రస్తుతానికి ఇది ..ఇక రేపు ఏమౌతుందో
రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేసాడు pic.twitter.com/cUGaxDAqTO
— Venu M Popuri (@Venu4TDP) December 20, 2021
చిత్తూర్ లో జగన్ మీద వీడియో పెట్టిన వ్యక్తి 24hrsలో మానసిక రోగంతో ఆత్మహత్య
సుధాకర్ మానసిక రోగి
ఏలూరు మృతులు మాస్ హిస్టీరియా-వైసీపీ
ఇప్పుడు గుప్తా మానసికరోగి అని భార్య చేతే చెప్పించారు
పాపం????కుటుంబం అంత మీ అభిమానులు ఇన్నాళ్లు!కనీసం ఆ కనికరం లే
పైగా పార్టీ మేలు కోరే చెప్పాడు https://t.co/L5eELWK4h3 pic.twitter.com/7hqEiDKzDm
— మన ఆంధ్ర (@AndhraFact) December 20, 2021
YS రెడ్ల పార్టీ రాజ్యాంగం
పార్టీలో జరుగుతున్న తప్పులు ఎత్తి చూపాడని,YCPనేత గుప్తా ఇంటిపై దాడి చేసి,అతని భార్యని బెదిరించి,వాహనం ద్వంసం చేశారు
మరి ఇవే తప్పులు ఎత్తి చూపిన,ప్రసన్న రెడ్డి,ఆనం రెడ్డి ఇతర రెడ్డి నేతలని ఏమీ అనరు
YS రెడ్డి పార్టీలో,రెడ్లు తప్ప ఎవరూ మాటాడకూడదు కాబోలు pic.twitter.com/MomxoytaGp
— Gangadhar Thati (@GangadharThati) December 19, 2021