చేయి తప్పు చేస్తే సర్ది చెప్పుకోవచ్చు. అందుకు నోరు సాయం చేస్తుంది. కానీ.. నోరే తప్పు చేస్తే.. సాయం చేసేందుకు ఏముంటుంది? ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఎమోషన్ తో ఉన్నప్పుడు అందరూ తప్పులు చేస్తారు.
బాలినేని సైతం అందుకు మినహాయింపు చేశారు. సొంత పార్టీ నేత.. అందునా తన వర్గానికి చెందిన వ్యక్తిపై తన అనుచరులే దాడి చేయటమే కాదు.. దారుణమైన తిట్లు తిట్టేసి.. ఇష్టారాజ్యంగా కొట్టేయటం.. దానికి సంబంధించిన సజీవ సాక్ష్యంగా నిలిచే వీడియో వైరల్ కావటం మంత్రి బాలినేనికి ఊహించని ఎదురుదెబ్బగా చెప్పాలి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా ఉండే ఆయన.. సోలిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ లో ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇలాంటప్పుడు సంయమనంతో వ్యవహరించి.. ధర్మంగా మాట్లాడి ఉంటే బాగుండేది. అన్యాయంగా దాడికి పాల్పడిన తన అనుచరుడు సుభానిని జైలుకు పంపిస్తే బాగుండేది.
వీడియో వైరల్ అయ్యాక.. విచారం వ్యక్తం చేసి..ఇలాంటి తీరు ఏ మాత్రం సరైంది కాదని.. చర్యలు తీసుకుంటామని చెప్పినా బాగుండేది. అందుకు భిన్నంగా తన మీద విమర్శలు చేసిన నేపథ్యంలో.. తన అనుచరులు కోపానికి గురై దాడి చేసి ఉంటారన్న మాట బాలినేని నోట వచ్చింది.
అంతేనా.. సుబ్బారావు గుప్తాకు మతిస్థిమితం లేదని ఆయన భార్యే చెప్పిందంటూ బాలినేని చేసిన ఖరీదైన తప్పుగా చెబుతున్నారు. ఎందుకంటే.. మతిస్థిమితం లేని అదే సుబ్బారావును వెంట పెట్టుకొని విజయవాడకు తీసుకొచ్చి.. తన అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకకు తీసుకురావటమే కాదు.. అందరి ముందు కేక్ కోసిన బాలినేని.. సుబ్బారావు నోట్లో పెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తన వర్గానికి చెందిన సుబ్బారావును.. తన అనుచర వర్గానికి నాయకత్వం వహించే సుభాని చితక్కొట్టేసిన తర్వాత కూడా.. ఆయన్ను వెంట పెట్టుకు వెళ్లే టాలెంట్ బాలినేనికి సొంతమని చెప్పాలి. సుబ్బారావుకు మతిస్థిమితం లేదని ఆయన భార్య చెప్పిందని.. అలాంటి వ్యక్తి.. అన్నీ పార్టీల జెండాలు.. బ్యాడ్జీలు అమ్మేవాడి మాటల వెనుక టీడీపీ నేత దామచర్ల ఉన్నారన్న బాలినేని వ్యాఖ్యానించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోజు తిరిగేసరికి.. సుబ్బారావును వెంట పెట్టుకొని విజయవాడకు ఎలా వచ్చారు? మతిస్థిమితం లేని వారి నోట్లో కేక్ ఎలా పెడతారు? ఇంతకూ సుబ్బారావుకు మతిస్థిమితం ఉందా? లేదా? అన్న విషయాన్ని ఆయన సతీమణి కంటే కూడా బాలినేని సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే.. మతిస్థిమితం లేదని సదరు కుటుంబ సభ్యులు తేల్చిన తర్వాత.. సుబ్బారావు విషయంలో బాలినేని ఎందుకలా వ్యవహరించారు? అన్న దానికి ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులో సమాధానం చెప్పక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక బాధ్యత గల భర్త గా & ముగ్గురు పిల్లలకి తండ్రిగా…, రౌడీలకంటే పోలీసులే ప్రమాదకరమని తెలుసుకున్న తర్వాత కూడా, అతను పరిణామాలకు రాజీ పడక ఏం చేస్తాడు ? ఈ వ్యవస్థ ను ఎదుర్కొనగలడా…?
తన కుటుంబాన్ని అనాధకుటుంభంగా చేసుకోలేడుగా….. pic.twitter.com/9kYVJm8zFD— ℙ???? ℍ???????????????????? (@PnHarini) December 21, 2021
మోకాళ్ళపై నిలబెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి క్షమాపణలు చెప్పించిన మంత్రి అనుచరులు…
వీడియో కాల్ లో వీక్షించిన ముగ్గురు ప్రముఖులు.,
పోలీసులకు ఇవి కనపడవా ? pic.twitter.com/dgGRmHqHxR— Kollu Ravindra (@KolluROfficial) December 21, 2021