నటసింహం నందమూరి బాలయ్య చిన్నల్లుడు.. మెతుకుమల్లి శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నామినేషన్ వేశారు. అదేవిధంగా అఫిడవిట్‌ను కూడా సమర్పించారు. దీనిలో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం.. 5 కిలోలకు పైగా బంగారం, 50 కిలోలకు పైగా వెండి ఆయన సతీమణి తేజస్విని పేరిట ఉంది. ఇక, వీరి ఆస్తులు మొత్తం 999.41 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తున్న అందరి అభ్యర్థుల ఆస్తితో సమానంగా ఉండడం గమనార్హం.
ఇవీ వివరాలు..
+ శ్రీభరత్ వద్ద నగదు రూ.2,79,974 బంగారం 50 గ్రాముల బంగారం, వెండి 518 కిలోలు, చరాస్తులు కింద రూ. రూ.16,89,77,866 లు ఉన్నాయి.
+ తేజస్విని పేరిట రూ.22,956 నగదు, బంగారం 5,395 గ్రాములు, వెండి 52.5 కిలోలు, రూ.48,36,73,751 విలువైన చరాస్తులు ఉన్నాయి.
+ శ్రీభరత్ పేరిట కియా, ఆడిక్యూ 7 కార్లు ఉండగా, తేజస్వినికి వాహనాలు లేవు.
+ స్థిర ఆస్తులకు సంబంధించి శ్రీభరత్ కు రూ.18395 కోట్లు. తేజస్వినికి రూ. 44,20,21,657 విలువైన భూములు. స్థలాలు, భవనాలు ఉన్నాయి,
+ శ్రీభరత్ కు రూ.38,71,833, తేజస్వినికి రూ.1,52,92,684 అప్పులు ఉన్నాయి..
మంత్రి బొత్స కుటుంబం ఆస్తులు ఇవీ..
విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమని బొత్స ఝూన్సీ సమర్పించిన అఫిడవిట్లో తమకు మొత్తం రూ.19.78 కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. ఝూన్సీ వద్ద రూ.45 లక్షలు, ఆమె భర్త సత్యనారాయణ వద్ద రూ.4.75 లక్షల నగదు ఉంది.
+ ఝాన్సీ వద్ద 325 తులాలు, సత్యనారాయణ వద్ద 31 తులాల బంగారం ఉంది.
+ చరాస్తులు ఝాన్సీ వద్ద రూ.4,75,35,148, ఆమె భర్త వద్ద రూ.3,78,32,513 ఉన్నాయి.
+ స్థిరాస్తులు(భూములు, భవనాలు తదితరాలు) ఝాన్సీ పేరిట రూ. 4,46,90,000, సత్యనారాయణ పేరిట రూ.6,75,46,000 విలువైనవి ఉన్నట్లు చూపించారు.
+ ఝూన్సీకి రూ. 2,32,30212, ఆమె భర్త సత్యనారాయణకు రూ.1,92,67,357లు అప్పులున్నాయి.
+ ఝూన్సీ, ఆమె భర్తకు చెరో వాహనం ఉంది.