ఆ కోవలో ఓ కుటుంబం ఇప్పటికీ టీడీపీ విధేయతతో రాజకీయ రంగాన రాణించేందుకు కృషి చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాము సిద్ధమేనని అంటోంది. ప్రజల్లో నిబద్ధత ఉంటే, ప్రజా స్వామ్య స్ఫూర్తి ఎక్కడ చెడిపోతుంది అన్నది గుర్తించగలిగితే మరిన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఇవాళ టీడీపీ భావన. ఇదే భావనతో ఆ యువ నేత సుందర విశాఖ తీరాన పనిచేస్తున్నారు. గీతం వర్శిటీ నిర్వహణతో పాటే రాజకీయాల్లోనూ ఎదిగేందుకు, వచ్చే ఎన్నికల్లో సత్తాచాటేందుకు కృషి చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే..
స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న నేపథ్యంతో మాట్లాడే నాయకుడు అతడు. తాత,తండ్రి వారసత్వం అందుకుని విఖ్యాత గీతం విద్యా సంస్థల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ, నాణ్యతలో రాజీ పడని ధోరణికి ప్రాధాన్యం ఇ స్తూ వస్తున్న అడ్మినిస్ట్రేటర్ అతను. ఆయనే బాలయ్య చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల సారథి భరత్.. ఇవాళ పుట్టినరోజు.. ఆయన గురించి ఇంకొంత. మొన్నటి వేళ ఆయన్ను ఓ జర్నలిస్టు కలిసి కొన్ని తిక్క తిక్క ప్రశ్నలు అడిగారు.
వాటన్నింటినీ విని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనుకోవడం లేదని, నేనొక్కడినే వాళ్లకు ఇష్యూ కానని మరో మారు స్పష్టం చేశారు. ప్యాండమిక్ సిట్యువేషన్ లో కూడా తమ సంస్థల అధ్యాపక బృందానికి పూర్తి వేతనాలు చెల్లించామని చెబుతూ, తమ నిబద్ధత ఏంటన్నది చెప్పకనే చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.ఆయన మాటల్లో పార్టీ విషయమై పనిచేసేందుకు క్రమశిక్షణతో ఎప్పుడూ సిద్ధమేనన్న స్పష్టత వినిపిస్తోంది. ముఖ్యంగా తమ సంస్థల నిర్వహణపై, విద్యా సంస్థలకు ప్రభుత్వం అందివ్వని సహకారం పై అన్నింటిపై ఆయన కు బలమైన అభిప్రాయాలే ఉన్నాయి.
మీరెలా అనుకుంటారు విశాఖలో టీడీపీ వీక్ గా ఉందని .. మీరెలా అనుకుంటారు పార్టీ లో కొందరు (గంటా శ్రీనును ఉద్దేశిస్తూ) నన్ను టార్గెట్ చేస్తున్నారని, అవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్ .. వీలున్నంత వరకూ సాల్వ్ చేసుకుంటాం.. అవన్నీ మీడియాతో చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఆ సీనియర్ జర్నలిస్టుకు స్పష్టమయిన రీతిలోనే సమాధానం ఇచ్చారు.
ముఖ్యంగా గీతం విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వంతో మీకు డీల్ కుదిరిందా అన్న ప్రశ్నకు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేం లేదండి క్యాబినెట్ డెసిషన్ ఏవిధంగాఉంటే దానిని మేం పాటిస్తాం అంతేకానీ నలుగురైదుగురు విశాఖ ఎమ్మెల్యేలతో చెప్పించినంత మాత్రాన పనులు అయిపోతాయని నేను అనుకోవడం లేదండి అలా చెప్పించాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు అని స్పష్టం చేశారు.