స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ అరుదైన మైల్ స్టోన్ కు అతి చేరువలో ఉన్నారు. సినిమా పరిశ్రమలో నటుడిగా కెరీర్ ప్రారంభించి బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ట్యాగ్ ను సొంతం చేసుకోబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ తొలిసారి తాతమ్మకల సినిమాతో వెండితెరపై మెరిశారు.
ఈ చిత్రానికి నందమూరి తారక రామారావు గారు స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రను కూడా పోషించారు. ఆయన కూమారులుగా బాలకృష్ణ, హరికృష్ణ నటించారు. భానుమతి మరో ముఖ్యమైన పాత్రను పోషించారు. రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన తాతమ్మకల చిత్రం 1974 ఆగస్టు 30న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ ఆగస్టు 30 వస్తే తాతమ్మకల చిత్రానికి 50 ఏళ్లు. అలాగే బాలకృష్ణ తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభం కూడా 50 ఏళ్లు పూర్తి అవుతాయి.
ఈ ఐదు దశాబ్దాల కెరీర్ లో బాలయ్య గ్యాప్ లేకుండా వరుసగా.. అది కూడా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో వేరే నటుడు ఎవరికీ సాధ్యం కాలేదు, ఒక్క బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు ఇది. ఈ నేపథ్యంలోనే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న బాలయ్యకు సెప్టెంబర్ 1 న తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చి ఘన సన్మానం చెయ్యాలని నిర్ణయించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా రాజకీయ ప్రముఖులు, అభిమానులు కూడా భారీగా తరలిరానున్నారని తెలుస్తోంది.