ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన విషయం తెలిసిందే.
పండగ రోజున కుటుంబమంతా ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటుచేసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. భార్య వసుంధర, కొడుకు మోక్షజ్జ గుర్రం పక్కన నిలబడి ఉన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.