నందమూరి బాలకృష్ణకు వసూళ్ల పరంగా అత్యంత బలహీనమైన ప్రాంతాలలో అమెరికా ఒకటి. బాలయ్య అంటేనే మాస్. పైగా లోకల్ మాస్ కంటెంట్ ఎక్కువ. కాకపోతే రౌద్రరసం పండించడం బాలయ్య స్పెషాలిటీ.
అయితే… కొన్ని కోణాల్లో బాలయ్య ఎంత బాగా చేసినా యు.ఎస్ ప్రేక్షకుల అభిరుచి వేరు. క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు అక్కడ ఆదరణ ఎక్కువ. అందుకే బాలయ్య సినిమాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి కొన్ని సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు తెచ్చుకున్నాయి.
కానీ బాలయ్య గత చిత్రం ‘అఖండ’ మాత్రం అమెరికాలో దుమ్మురేపింది. అఖండ అమెరికాలోను మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఇప్పుడు యూఎస్‌లో బాలయ్య కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ప్రీ సేల్ రియాక్షన్ చూసి అందరూ షాక్ అవడం ఒకటే తక్కువ.
విడుదలకు పది రోజుల ముందు ప్రీ సేల్స్ లో ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా వసూలు చేయడం అక్కడి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సినిమా కలెక్ఛన్ల కంటే కూడా అది ఎక్కువగా ఉండటం అందరికీ షాకే. యూఎస్ లో బాలయ్య కంటే చిరంజీవికి మామూలుగానే కాస్త ఎక్కువ మార్కెట్ ఉంది. అలాంటిది ఈసారి సీన్ రివర్సయ్యింది.
అమెరికాలోని అన్ని ఏరియాల్లో వీరసింహారెడ్డి టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి బాలయ్య సినిమాలు ఎక్కువ చోట్ల, ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శింపబడుతున్నాయి. టిక్కెట్ల విక్రయంలోనూ బాలయ్య సినిమాదే పైచేయి. మొదట్లో బాలయ్య సినిమా ప్రీ సేల్స్ ఊపందుకోవడం చూస్తుంటే ఓ వర్గం కష్టపడి టికెట్లు కొనడం వల్లే ఇలా జరుగుతోందని పుకార్లు పుట్టించారు. కానీ అది నిజం కాదని చెప్పడానికి అమెరికాలో అన్ని ఏరియాల్లో బుకింగ్స్ రావడాన్ని చూడొచ్చు.
’అఖండ’ సూపర్ సక్సెస్.. ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలయ్యకు యంగ్, క్లాస్ ఆడియన్స్‌లో బాగా ఫాలోయింగ్ పెరిగిపోవడంతో పాటు ‘వీరసింహారెడ్డి’కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పటి వరకు ‘వీరసింహారెడ్డి’ యూఎస్ ప్రీసేల్స్ ద్వారా 1.61 లక్షల డాలర్లు వసూలు చేయగా, ‘వాల్తేరు వీరయ్య’ ప్రీసేల్స్ 1.31 లక్షల డాలర్లకు చేరాయి.
A Picture from an all time Telegu hit biggest block buster 28 yrs hence #GharanaMogudu re released seen in the pic along with Producer Devivar Prasad ji his daughter, director Raghvendra Raoji and hero’s Chiranjeevi and Balakrishna pic.twitter.com/bPSnpQKw3j
— Nagma (@nagma_morarji) April 10, 2020