సుమారు ఐదు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిద్యమైన పాత్రలను పోషిస్తూ అగ్ర నటుడిగా ఎదిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. సేవ గుణంలోనూ ఎప్పుడూ ముందే ఉంటారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎందరో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలతో అపన్నులకు అండంగా నిలుస్తున్నారు. అయితే ఇతరులకు సాయం చేయడంలో బాలయ్యే కాదు ఆయన అభిమానులు కూడా బంగారమే. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితం అయింది.
ఓ పసిప్రణాన్ని కాపాడేందుకు బాలయ్య అభిమానులు చేస్తున్న కృషికి నెటిజన్లు శభాష్ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన అయితగోని రవి, మమతా దంపతుల కూతురు ఆరుషీ క్యాన్సర్ బారిన పడింది. ఈ ఇరవై నెలల చిన్నారి వెన్నుముకలో కణిత ఏర్పడింది. ఏప్రిల్ లో సర్జరీ చేసి వైద్యులు కణితను తొలిగించారు. అయితే అదే భాగంలో ఆరుషీ మరో కణిత ఏర్పడగా.. గత నెల 20న సర్జరీ చేసి తీశారు.
మరోసారి కణిత ఏర్పడకుండా ఆరోషీకి కీమో థెరపీ చేయాలని వైద్యులు సూచించారు. కానీ ఇప్పటికే సర్జీరలకు, చికిత్సకు రూ. 8 లక్షలు వరకు ఖర్చు అయింది. ఇప్పుడు కీమో థెరపీ చేయడానికి మరో రూ. 8 లక్షలు ఖర్చు అవుతాయి. అంత ఆర్థిక స్తోమత ఆరుషీ తల్లిదండ్రులకు లేకపోవడంతో.. తమ కూతురిని బతికించడానికి సాయం చేయాలంటూ దాతలను కోరుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ అభిమానులు.. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. అక్కడితో చేతులు దులుపుకోకుండా పాపను ఎలాగైనా రక్షించాలని దాతల కోసం అన్వేషన ప్రారంభించారు. ఆరుషీ ఆరోగ్య స్థితి, ఆమె తల్లిదండ్రుల పరిస్థితిని తెలియజేస్తూ.. సాయం చేయడానికి ముందుకు రావాలని సోషల్ మీడియా ద్వారా బాలయ్య ఫ్యాన్స్ దాతలను కోరుతున్నారు. ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇప్పటికి 8 లక్షలు ఖర్చు అయ్యింది ఇంకా 8 లక్షల వరకు అవసరం ఉంది.
చిన్నారి ఆరుషి కి మీరు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి అనుకుంటే పేపర్ యాడ్ లో ఇచ్చిన డీటైల్స్ కు చేయండి 🙂 ప్రతి చిన్న సహాయం వాళ్ళకి ఎంతోకొంత బలం అవుతుంది 🤞🏻🙏🏻
Get well soon Nanna Aarushi 💛 https://t.co/cLSYmOIV6j pic.twitter.com/vaD3s3zToq
— Gopi Nath NBK (@Balayya_Garu) September 29, 2024