• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మాకు ఈ ఎమ్మెల్యే వద్దు బాబోయ్ వ‌ద్దు.. మ‌రి బాబు నిర్ణ‌య‌మేంటి..?

admin by admin
September 30, 2024
in Andhra, Politics
0
0
SHARES
140
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్ర‌స్తుతం టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి, దూకుడు త‌ట్టుకోలేక సొంత పార్టీ నాయ‌కులు, స్థానిక జర్నలిస్టులు అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఫిర్యాదులు చేస్తున్నారు. మాకు ఈ ఎమ్మెల్యే వ‌ద్దు బాబోయ్ వ‌ద్దంటూ ల‌బోదిబో మంటున్నారు. నాలుగేళ్లు పాటు అమరావతి రైతు ఉద్యమంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి వెలుగులోకి వ‌చ్చిన కొలికపూడికి గ‌త ఎన్నిక‌ల్లో ఏరి కోరి మ‌రీ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును టీడీపీ అధిష్టానం కేటాయించింది.

టీడీపీ నేతృత్వంలోని కూటమి మద్దతుగా నిల‌వ‌డంతో ఆయ‌న సులువుగా గెలిచి తొలిసారి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇక ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైంది. ఎమ్మెల్యేగా గెలిచిన అనంత‌రం కొలికపూడి త‌న దూకుడు స్వ‌భావాన్ని బ‌య‌ట‌పెట్టారు. సత్వర న్యాయం పేరుతో వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చివేయ‌డానికి య‌త్నించ‌డం వివాదం అయింది. కొలికపూడిపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను మంద‌లించారు.

అయినా కూడా కొలిక‌పూడి తీరు మార‌లేదు. మొన్న‌టికి మొన్న చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దుర్భాషలాడారు. దాంతో తీవ్ర ఆవేద‌న‌కు గురైన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డి.. ప్ర‌స్తుతం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌తో సొంత పార్టీ నేత‌ల్లో కొలికపూడిపై మ‌రింత అసంతృప్తి ఏర్ప‌డింది. మ‌రోవైపు స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్ర‌వ‌ర్థిస్తుండ‌టంతో.. వారు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును క‌లిశారు. మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడటమే కాకుండా బెదిరిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే పై పలు ఆధారాలతో మీడియా వారు ఫిర్యాదులు అందించారు.

ఇటువంటి ప‌రిణామాల నేప‌థ్యంలో సొంత పార్టీకి సంబంధించిన కొందరు నేతలు తిరువూరు లోని గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుకుపోతున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి `సేవ్ తిరువూరు` ర్యాలీకి రెడీ అయ్యారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కొలికపూడి తీరుపై మండిపడుతున్నారు. మాకు ఈ ఎమ్మెల్యే వ‌ద్దంటే వ‌ద్దు అని సీఎంకు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్‌కు కంప్లైట్ చేశారు. కొలికపూడిపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్త ప‌రిచారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న‌ పార్టీ అధిష్ఠానం సేవ్ తిరువూరు ర్యాలీకి అడ్డుక‌ట్ట వేసింది. ఇక మ‌రి కొలికపూడి విష‌యంలో బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు అన్న‌ది చూడాలి.

Tags: Andhra PradeshAP Newsap politicsChandrababuCM Chandrababu NaiduMLA Kolikapudi SrinivasaraoNTR DistTDPtiruvuruTiruvuru MLA
Previous Post

బాల‌య్యే కాదు ఆయ‌న అభిమానులు బంగార‌మే..!

Next Post

బే ఏరియా లో ఘనంగా ‘రమేష్ తంగళ్లపల్లి’ జన్మదిన వేడుకలు!

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

బే ఏరియా లో ఘనంగా ‘రమేష్ తంగళ్లపల్లి’ జన్మదిన వేడుకలు!

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra