హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా కార్యకర్తలతో మాట్లాడిన ఆయన ‘నా అసలు అవతారం చూపిస్తా.. నేనేంటో, నా సంగతి ఏంటో చూపిస్తా.. బోయపాటి సినిమా తర్వాత నేను రోడ్లమీదకి వస్తా. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా.. దేనికీ భయపడవద్దు.. అయ్యేదేదో అవుతుంది. నేను మానసికంగా ప్రిపేర్ అవుతున్నా.. దేనికైనా సిద్ధం’ అన్నారు.
ఏపీ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని.. రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశారు. ఇదీ అంతే అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.
బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇప్పటివరకు పొలిటికల్‌గా తన నియోజకవర్గం వరకే పరిమితమై సర్వీస్ చేస్తున్న బాలయ్య ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో త్వరలో ఆయన వైసీపీపై దూకుడు పెంచబోతున్నారని అర్థమవుతోంది.
బాలయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలను బట్టి చూస్తే రాజకీయంగా స్పీడ్ పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి, బాలయ్య యాక్టివిటీ ఎలా ఉండబోతోంది.. వైసీపీని ఎదుర్కోవడానికి ఆయన ఏం చేస్తారన్నది తెలియాలంటే కొద్ది నెలలు వెయిట్ చేయాల్సిందే.