నందమూరి బాలకృష్ణ, నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్)…ఈ రెండు పేర్లు వినగానే అన్నగారి అభిమానులలో తెలియకుండానే ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య బాబు ఇటు అగ్ర నటుడిగా, అటు సక్సెస్ ఫుల్ పొలిటిషియన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న బాలయ్య…ఎన్టీఆర్ లా సామాజిక సేవలోనూ ముందున్నారు. ఇక, జూ.ఎన్టీఆర్ కూడా తాతకు తగ్గ మనవడిగా…సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిపోతున్నాడు. దీంతో, బాబాయి, అబ్బాయి కలిసి వెండితెరపై వెలిగిపోతే చూడాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే, వీరిద్దరూ కలిసి నటించలేదు. ఇంకా చెప్పాలంటే వారిద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. కొద్ది సంవత్సరాల క్రితం నందమూరి హరికృష్ణ మృతి సమయంలో వీరు ఒకేచోట కనిపించారు. ఆ తర్వాత వీరు కలిసి ఒకేచోట కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఓ గాసిప్ ఫిల్మ్ నగర్ టూర్ చేస్తోంది. బాలయ్య, తారక్ ఇద్దరూ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారన్న వార్త పుకార్లు చేస్తోంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వారిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారట.
ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ లుగా తారక్, బాలయ్య హాజరుకాబోతున్నారట. అయితే, తారక్ రావడం పక్కా అని,కానీ, బాలయ్య బాబు ఇంకా నిర్ధారణ కాలేదని తెలుస్తోంది. అయితే, ఈ ఈవెంట్ కు రావడానికి బాలయ్య కూడా సుముఖంగా ఉన్నారని, అధికారికంగా మాత్రం వెల్లడించాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే…నందమూరి అభిమానులకు పండగే. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో తెరకెక్కుతున్న తొలి ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ మూవీ ఇది.
పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 5 అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే `బింబిసార` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.