టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, టాలీవుడ్ నయా సెన్సేషన్, యంగ్ బ్యూటీ శ్రీ లీలల కాంబినేషన్లో మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ పై బాలయ్య బాబు ప్రశంసలు కురిపించారు.
ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేందుకు, కొత్త పాత్రలలో నటించేందుకు రామ్ ట్రై చేస్తున్నాడని ప్రశంసించారు. ఇక, భగవంత్ కేసరి చిత్రంలోని తన పాత్రకు రామ్ సవాల్ విసురుతున్నాడని అన్నారు. తెలంగాణ నేపథ్యంలోనే ఈ రెండు చిత్రాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో బాలయ్య బాబు ఈ కామెంట్లు చేశారు. అందం, అభినయం, నాట్యం తెలిసిన అమ్మాయి శ్రీ లీల అని, వరుసగా సినిమాలు చేస్తున్నా ఎంతో యాక్టివ్ గా ఉంటుందని కితాబిచ్చారు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని బాలకృష్ణ కోరుకున్నారు. ఇక, బోయపాటి అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఈ సినిమాతో ఆయన మరో హిట్ కొడతారని బాలయ్య ఆకాంక్షించారు. ఈ చిత్ర యూనిట్ కు బాలయ్య శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఈవెంట్ సందర్భంగా బాలయ్యపై రామ్ పోతినేని ప్రశంసలు కురిపించారు. 3 తరాల ప్రేక్షకులను మెప్పించడం బాలయ్యకే సాధ్యమని కొనియాడారు. ఇక, బాలయ్య బాబుతో తాను 15 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నానని, ఆయన వ్యక్తి కాదని ఒక శక్తి అని అన్నారు. ఒక పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రను లొంగదీసుకుంటారని అన్నారు. తమ మధ్య ఉన్న సాహిత్యం వల్ల ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా బాలయ్య బాబు వచ్చారని చెప్పారు. బాలయ్య బాబు ఆశీర్వాదానికి ఎంత బలం ఉందో తనకు తెలుసని చెప్పారు. ఈ సినిమా తప్పక ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.