మెగాసిటీ నవకళా వేదిక సంస్థ వారు ప్రతి ఏటా ఇచ్చే విశిష్ట ఉగాది పురస్కారాలు ఈ సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన ప్రముఖులకు 31.03.22 న ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ శ్రీ మధుసూదన్ చారి గారు ముఖ్య అతిధిగా పాల్గొని అవార్డులను అందజేశారు.
హైద్రాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమము ముందుగా పసందైన తెలుగు సంగీత విభావారితో మొదలై అతిథుల ఆశీర్వచన ప్రసంగాలతో సాగింది. ఈ అవార్డులు అందుకొన్న వారిలో శ్రీ ఎన్ బాలాచారి గారు ఉన్నారు.
ప్రభుత్వ సర్వీసులో 22 సంవత్సరాలు వివిధ డిపార్ట్మెంట్ లలో పనిచేసి తనదైన ముద్ర వేశారు. గ్రామీణ అభివృద్ధి ద్యేయంగా స్వచ్ఛ భారత్ , మహిళలకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, రుణాల అందజేత, గ్రామీణ ప్రజల ఆరోగ్యం పై యూనిసెఫ్ వారితో 6 సంవత్సరాల సేవ, హోసింగ్, లెజిస్లేచర్ ఇంకా 3 సంవత్సరాలు బిసి స్టడీ సర్కిల్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగలకు కోచింగ్ ఇచ్చి 1000 మందికి పైగా ఉద్యోగ కల్పన తదితర సేవలకు గుర్తింపుకు గాను వారికి విశిష్ట ఉగాది పురస్కారం వరించింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటువంటి సత్కారాలు మనం చేసే పనికి ఇంధనం లా పనిచేసి ఇంకా ఉత్తేజపరిచి మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా చేస్తాయని అవార్డుకు ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియ చేశారు.