ఈ ఏడాది తెలుగులో పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బిగ్గెస్ట్ హిట్.. బేబీ మూవీనే. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా దవంద కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం రేపింది. ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలైనా రెండు వారాల తర్వాత స్లో అయిపోతాయి కానీ.. ఈ చిత్రం మాత్రం నెల రోజుల పాటు థియేటర్లను కళకళలాడించింది. బ్రో లాంటి పెద్ద సినిమా పోటీని కూడా తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది.
బేబితో సంచలనం రేపిన కాంబినేషన్లో మళ్లీ ఇంకో సినిమా రాబోతోంది. దర్శకుడు సాయిరాజేష్‌తో నిర్మాత ఎస్కేఎన్ ఇంకో సినిమా చేయనున్న విషయం ఇంతకుముందే వెల్లడైంది కానీ.. అందులో బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలే హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయం ఈ రోజే ప్రకటించారు. ఐతే ఇందులో వేరే లీడ్ క్యారెక్టర్ ఏదీ లేనట్లే ఉంది. ఈ ఇద్దరి మధ్య నడిచే ప్రేమాయణం నేపథ్యంలోనే సినిమా రూపొందబోతోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి చిన్న ట్విస్ట్ ఏంటంటే.. దీనికి దర్శకుడు సాయి రాజేష్ కాదు.
ఆయన ఈ చిత్రానికి స్క్రిప్టు మాత్రమే అందిస్తున్నాడు. అలాగే ఎస్కేఎన్తో కలిసి ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించబోతున్నాడు. ఈ చిత్రంతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. 2024 వేసవి రిలీజ్ అని అనౌన్స్మెంట్ పోస్టర్ మీదే వేసేశారు. బేబికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానినే ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చునున్నాడు. సెన్సేషనల్ బేబి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.