ఏనుగుతోనే యోగా బాబా గేమ్సా ?
యోగాసనాలు వేయటానికి, విన్యాసాలు ప్రదర్శించటానికి బాబా రాందేవ్ కు ఎక్కడా చోటు దొరకలేదేమో ? అందుకనే ఓ ఆశ్రమంలో ఏనుగును చూడగానే యోగాసనాలు వేయాలనే ఆలోచన వచ్చేసింది. ఇంకేముంది వెంటనే మావటితో మాట్లాడేయటం ఏనుగును ఎక్కేయటం , యోగాసనాలు వేయటం అన్నీఅయిపోయాయి. అయితే యోగాసనాలు వేస్తున్నపుడు బ్యాలెన్సు తప్పిన బాబా అంతెత్తునుండి కిందపడిపోవటమే కొసమెరుపు.
రాందేవ్ బాబా అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కేవలం యోగా బాబాగా పాపులరైన తర్వాత రాందేవ్ పతంజలి పేరుతో కొన్ని ఫుడ్ ప్రాడక్ట్స్ తీసుకొచ్చి విపరీతంగా మార్కెటింగ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తన ప్రొడక్ట్సును మార్కెటింగ్ చేసుకోవటానికి ప్రత్యేకించి సెలబ్రిటీలతో ప్రకటనలు ఇచ్చుకోలేదు. ఎందుకంటే తానే ఓ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు రాందేవ్. అందుకనే దేశంలోని నలుమూలల్లోను పతంజలి ఉత్పత్తులను హాయిగా ఎటువంటి సమస్యలు లేకుండా అమ్ముకోగలుగుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మధుకరు రాందేవ్ వెళ్ళారు. మధురలోని ఓ ఆశ్రమంలో యోగా పాఠాలు బోధించారు. అయితే అదే సమయంలో సర్వాంగ సుందరంగా అలంకరించున్న ఓ ఏనుగు బాబా కంటపడింది. ఏనుగును చూడగానే బాబాలో వెరైటీ ఆసనాలు ఏమన్నా గుర్తుకొచ్చాయో ఏమో తెలీదు. వెంటనే మావటివాడితో మాట్లాడేసుకుని ఏనుగుపైకి ఎక్కేశారు. ఏనుగు పైకి ఎక్కిన తర్వాత ముందుగా పద్మాసనం వేసుకుని ప్రాణాయామం ఎలా చేయాలో చూపించేందుకు రెడీ అయ్యారు.
అయితే ఏనుగుకు ఏమైంది ఏమో కాస్త అటు ఇటు కదలింది. ఇంకేముంది అసలే పద్మాసనం వేసుకుని కూర్చున్న బాబా జాగ్రత్త పడే అవకాశం లేకుండా పోయింది. దాంతో అంతెత్తునుండి జారి క్రిందపడిపోయారు. అంతెత్తునుండి జారిపడినా ఎటువంటి గాయాలు కాకపోవటంతో వెంటనే లేచి నిలబడి సర్దుకున్నారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
Watch: Yoga guru Baba Ramdev falls off elephant while performing yoga, video goes viral. pic.twitter.com/y7cMJp9VRB
— TIMES NOW (@TimesNow) October 13, 2020