షర్మిల ఎంట్రీతో కొత్త రాజకీయ కలకలం నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించిన వైయస్ షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో జిల్లాలో నిర్వహించనున్న సభలో పార్టీని ఆమె ప్రకటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జనసేనతో పోలిస్తే పార్టీ నిర్మాణంలో షర్మిల వ్యూహాలే బెటర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారామె. ఇక మరోవైపు షర్మిల పలువురు ప్రముఖులను కలుపుకుని పోతోంది. తాజా గా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు, టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనంమీర్జా షర్మిలను ఆమె కార్యాలయంలో కలిశారు. వీరిద్దరూ భార్యాభర్తలు అనే విషయం తెలిసిందే.
వీరు షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వారు మాత్రం ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అంటున్నారు. మరికొందరు సెటబ్రిటీలు కూడా షర్మిల పార్టీపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ పార్టీని ఇంకా ప్రకటించక ముందే షర్మిల పార్టీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఆసక్తి నెలకొంది.