వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా, మాస్టర్ మైండ్ గా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ మరోసారి కడప సీటు ఇవ్వడం కడప ప్రజలను షాక్ కు గురిచేసింది. జగన్ ఆ సీటు ఇవ్వడంతో వివేకా మర్డర్ కేసులో నిందితుడిని జగన్ నేరుగా కాపాడటమే కాకుండా, ఎంకరేజ్ చేస్తుండటంతో జగన్ కూడా అందులో భాగస్వాముడే అన్నట్టు ప్రచారం మొదలైంది.
అంతేగాక నేరు జగన్ చెళ్లెల్లు షర్మిల, సునీతా రెడ్డిలు అవినాష్ హంతకుడు, అతనికి జగన్ సీటు ఇస్తాడా అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో కంగారుపడిన జగన్ మొదటికే మోసం వచ్చేలా ఉందని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పర్చూరు టికెట్ వదులుకుని కాంగ్రెస్ లో చేరారు ఆమంచి కృష్ణమోహన్. దీంతో పాటు ఇటీవల వచ్చిన పోతిన మహేష్ కు కూడా సీటు ఇవ్వాలని జగన్ డిసైడయ్యారు.
ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో జగన్ సంచలన మార్పులు చేస్తున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది. అవేంటో చూద్దాం..
మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్..
విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్..
గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజనీ..
గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోసయ్య..
చాలా పెద్ద ట్విస్ట్.. ఏంటంటే…
కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి కి బదులుగా అభిషేక్ రెడ్డి ఖరారు చేశారు. ఇది షర్మిల కూడా ఊహించలేదు. నిజానికి అభిషేక్ రెడ్డి రాకతో షర్మిలకు గెలుపు అవకాశాలు బాగా పెరిగినట్టు తెలుస్తోంది. కానీ వైఎస్ ఫ్యామిలీ గొడవల్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.