మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను కాపాడేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే, ఈ కేసు విచారణను జగన్ సాగదీస్తున్నారని, ఈ క్రమంలోనే ఆ కేసు పొరుగు రాష్ట్రానికి తరలిందని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిపై వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ల పేర్లు కూడా సునీత ప్రస్తావించారు. అయితే, చెల్లెలు సునీత కంటే తమ్ముడు అవినాష్ అంటే ప్రేమ ఎక్కువగా ఉన్న జగన్…ఆ కేసు నుంచి అవినాష్ ను బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే సోదరుడు అవినాష్ రెడ్డిపై తనకెంత ప్రేమ ఉందో జగన్ మరోసారి చాటుకున్నారు. ‘ఆయన నా తమ్ముడేనయ్యా సామీ.. ఎవరో కాదు’ అంటూ ఓ వ్యక్తితో జగన్ అన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ పులివెందుల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా ఆయనకు అర్జీ ఇచ్చేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి రావడంతో…పక్కనే ఉన్న అవినాస్ కు అర్జీ ఇవ్వాల్సిందిగా జగన్ సూచించారు.
అయితే, ఆ వ్యక్తి జగన్ కే అర్జీ ఇవ్వబోయాడు. దీంతో, ‘ఆయన నా తమ్ముడేనయ్యా సామీ.. ఎవరో కాదు’ అంటూ అవినాష్ కు అర్జీ ఇవ్వాలని మరోసారి సూచించారు. ఆ అర్జీ తీసుకోవాలని అవినాష్ కు కూడా సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kadapa MP Avinash Reddy maa tammude kada swamy ????????????❤️ pic.twitter.com/0D0PeGzr7Q
— CNU REDDY (@HaisrinivasV) December 25, 2022